ఎవరు ఖాళీగా ఉన్నా ప్రభాస్ తో లింకు

Tollywood-Hero-Prabhas-movie-with-Arjun-Reddy-director-Andhra-Talkies
ఎవరు ఖాళీగా ఉన్నా ప్రభాస్ తో లింకు
ఫలానా దర్శకుడికి ప్రభాస్ కమిటయ్యారు అంటూ హాట్ డిబేట్ కి తెరపైకి తెస్తుండడం రకరకాల సందేహాలకు తావిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ప్రభాస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారన్న ప్రచారం సాగింది. అలాగే కొరటాల మిర్చి తర్వాత మళ్లీ అదిరిపోయే స్క్రిప్టును ప్రభాస్ కోసం రెడీ చేశారని.. డాషింగ్ డైరెక్టర్ పూరి సైతం ప్రభాస్ కి స్కెచ్ వేశాడని బోలెడంత ప్రచారం సాగిపోయింది. రాజమౌళి సైతం మళ్లీ ప్రభాస్ ని బరిలో దించుతాడని ఇటీవల సీనియర్ దర్శకుడు ఇమంది రామారావు యూట్యూబ్ కథనాలు వేడెక్కించాయి.పనిలో పనిగా ఖాళీగా ఉన్న ఇద్దరు దర్శకుల పేర్లు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నాగ్ అశ్విన్ కాగా.. సందీప్ రెడ్డి వంగా పేరు లేటెస్టుగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు తన సెన్సిబిలిటీస్ కి ఏమాత్రం మ్యాచ్ కాని నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా చేయడమేమిటా! అంటూ ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తుంటే అతడితో మూవీ ఖాయం అయ్యిందన్న ప్రచారం సాగిపోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ సినిమా క్యాన్సిల్ కావడం తో తదుపరి ప్రభాస్ తోనే సినిమా చేయబోతున్నాడని తాజా ప్రచారం వేడెక్కించేస్తోంది. ప్రభాస్ హీరోగా సందీప్ ఓ డార్క్ థ్రిల్లర్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని.. `డెవిల్` అనే టైటిల్ ని ఫైనల్ చేశాడని ప్రచారమవుతోంది. అయితే ఈ ప్రచారం నిజమా? అంటే దేనికీ అధికారిక ప్రకటన అయితే రానే లేదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...