ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

Tollywood-Heroin-Rashmika-Mandanna-Talking-About-Nithin-Marriage-Andhra-Talkies
ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

ఆమెతో సినిమా చేస్తే చాలు.. మధ్యలోనే పెళ్లి అయి పోతుందట

అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతుంటారన్న సామెతను తరచూ వింటుంటాం. చిత్రపరిశ్రమలో అలాంటోళ్లు కొందరు ఉంటారు. ఆ కోవకే చెందుతారు రష్మిక మందాడ. అలా అని ఆమె అందం.. టాలెంట్ తక్కువన్నది మా ఉద్దేశం కాదు. ఇవన్నీ చాలా ఉన్నా.. తాను చేసిన ప్రతి సినిమా హిట్ కావటం కొందరికి మాత్రమే సాధ్యం. ఒకవేళ హిట్ అయినా.. ఆ క్రెడిట్ మరెవరికో వెళ్లకుండా తనకు రావాల్సిన దాని కంటే ఎక్కువ క్రెడిట్ సొంతం చేసుకోవటం ఈ బ్యూటీ గొప్పతనం గా చెప్పాలి.

తాజాగా తనకు సంబంధించిన సెంటిమెంట్ ను రివీల్ చేశారు. వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఇద్దరు హీరోల విషయం లో జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఆమె చెప్పింది నిజమనిపించక మానదు. ఆమె నటించే సినిమాల్లో హీరోల పెళ్లిళ్లు తనతో సినిమా చేసే సమయంలోనే ఫిక్స్ అయిపోతాయని చెప్పింది.

తాను కన్నడలో పొగరు సినిమా చేస్తున్న సమయంలోనే ధృవ సర్జా పెళ్లి అయిపోయిందని. తాజాగా తాను నటించిన భీష్మ మూవీ హీరో నితిన్ పెళ్లి కూడా ఫిక్స్ అయి పోయిందని చెప్పింది. సినిమా టైటిల్ బ్యాచిలర్ అయినా.. హీరో మాత్రం ఎంగేజ్ అయిపోయారంది. ఎంగేజ్ మెంట్ కు రెండు రోజుల ముందే నితిన్ లవ్ స్టోరీ తనకు తెలిందని.. అప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదని చెప్పింది. తాను సినిమా చేసే హీరోలకు సినిమా పూర్తి అయ్యే లోపు పెళ్లి అయి పోతుందని.. మరోసారి ఇదే విషయం రిపీట్ అయినట్లగా పేర్కొంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...