టాలీవుడ్ సమ్మర్ సినిమాలివే !

Tollywood-Movie-Releases-in-This-Summer-Andhra-Talkies
టాలీవుడ్ సమ్మర్ సినిమాలివే !
టాలీవుడ్ కి సంక్రాంతి తర్వాత కాసులు కురిపించే సీజన్ సమ్మర్. స్కూళ్ళు కాలేజీలకు సెలవలు ప్రకటించడంతో మ్యాగ్జిమం ఆడియన్స్ ఆ టైంలో సినిమాకే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ సీజన్ లో రెండు నెలల పాటు దండిగా సినిమాలుంటాయి. ఏప్రిల్ మే రెండు నెలల్లో ఇప్పటి నుండే థియేటర్స్ బ్లాక్ చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ ఏడాది సమ్మర్ ను స్టార్ హీరోలు లైట్ తీసుకోవడంతో కుర్ర హీరోలు రంగంలోకి దిగబోతున్నారు.

ఏప్రిల్ లో నాగ చైతన్య చేస్తున్న 'లవ్ స్టోరి' రామ్ రీమేక్ సినిమా 'రెడ్' శర్వానంద్ ఎమోషనల్ డ్రామా 'శ్రీకారం' రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఇక మేలో సాయి ధరం తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' రవి తేజ 'క్రాక్' ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలా ఇప్పటికే అరడజను పైనే సినిమాలు సమ్మర్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఈ లిస్టులో యాడ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మరి వీటిలో ఏ సినిమాలు సీజన్ ను పర్ఫెక్ట్ వాడుకొని నిర్మాతలకు కాసులు కురిపిస్తాయో చూడాలి.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...