వారి నోరు మూయించిన #WFL బుకింగ్స్

WFL-bookings-showing-Vijay-Devara-Konda-craze-Andhra-Talkies

వారి నోరు మూయించిన #WFL బుకింగ్స్

అర్జున్ రెడ్డి.. గీత గోవిందం చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల సరసన చేరి పోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశ పర్చడంతో ముఖ్యంగా డియర్ కామ్రేడ్ చిత్రం నిరాశ పర్చడంతో ఆయన క్రేజ్ తగ్గిందని.. ఆయనకు గతంలో ఉన్నంత స్టార్ డం లేదు అంటూ కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కాని విజయ్ దేవరకొండ స్టార్ డం ఏంటో డియర్ కామ్రేడ్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ను చూస్తే అర్థం అవుతుంది.

క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి విజయ్ గతంలో తన సినిమాలకు చేసినట్లుగా చాలా అగ్రెసివ్ గా పబ్లిసిటీ కూడా చేయలేదు. అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. హైదరాబాద్ లో ఈ చిత్రం మొదటి రోజు 190 షోలు ఉన్నాయి. మొదటి రోజు 190 షోలకు గాను ఇప్పటికే 120 షోలకు బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. విడుదలకు ఇన్ని రోజుల ముందే 120 షోల బుకింగ్స్ క్లోజ్ అవ్వడం నిజంగా చాలా పెద్ద విషయం.మిగిలి ఉన్న 70 షోలకు కూడా నేడు రేపు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ అడ్వాన్స్ బుకింగ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఈ చిత్రం లో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించడం తో పాటు నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు.

ట్రైలర్ విడుదల తర్వాత సినిమా కాస్త గందరగోళంగా అనిపించినా తప్పకుండా చూడాలనిపించేలా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది అంటూ సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్ అదిరి పోయింది కనుక సినిమాకు ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా రౌడీ స్టార్ మరోసారి భారీ వసూళ్లను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...