ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

-Ay-Pilla--Lyrical--A-Mesmerizing-Melody-From--Love-Story-Andhra-Talkies
ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

ఏయ్ పిల్లా.. కమ్ముల సార్ మార్క్ మెలోడీ

అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లవ్ స్టోరి'. ఆసక్తికరమైన కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుండి 'ఏ పిల్లా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు పవన్.Ch సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు సాహిత్యం అందించినవారు చైతన్య పింగళి. పాడినవారు హరిచరణ్. "ఏయ్ పిల్లా పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా రారా కంచే దుంకి చక చక ఉరుకుతూ ఆ రంగుల విల్లుని తీసి నీ వైపు వంతెన వేసి రావా" సింపుల్ పదాలతో సాహిత్యం ఆహ్లాదకరంగా సాగింది. ఈ పాటకు తగ్గట్టుగా పవన్ ఓ మంచి ట్యూన్ అందించారు. హరిచరణ్ కూడా చక్కగా పాడారు. స్లో సాంగ్స్.. మెలోడీస్ ఇష్టపడేవారికి నచ్చుతుందేమో కానే ఈ పాట మిగతావారికి ఒక్కసారి వినగానే కనెక్ట్ అయ్యేది కాదు. తినగతినగ వేము తియ్యనుండు తరహాలో వినగ వినగా ఏయ్ పిల్లా నచ్చవచ్చు!అయితే కమ్ముల సారూ సినిమాలు మంచి కాఫీ తరహాలో ఉంటాయి.. పాటలు నెస్కెఫె యాడ్ ల తరహాలో ఉంటాయి కాబట్టి ఈ పాట కూడా అలానే ఆయన స్టైల్ లోనే ఉంది. మధ్యలో మిడిల్ క్లాస్ బాయ్ అవతారంలో చైతు.. మిడిల్ క్లాస్ గర్ల్ అవతారంలో సాయిపల్లవి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు చూసేయండి ఏయ్ పిల్లా పాట.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...