విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?


విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?

Actor-Ananya-Pandey-Sensational-Comments-On-Janvi-Andhra-Talkies
విజయ్ హీరోయిన్ కి అంత సీన్ ఉందా ...?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంకీ పాండే వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అనన్య పాండే. అందం తో పాటు అభినయం కూడా ఈమె సొంతం. 'పతీ పత్నీ ఔర్ ఓహ్' 'అంగ్రేజీ మీడియం' చిత్రాలతో మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం విజయ దేవరకొండ నటిస్తున్న మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని కరణ్ జోహార్ భాగస్వామ్యంలో నటి చార్మ్ కౌర్ నిర్మిస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెలుగు తమిళం తోపాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి మొదట విజయ్కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందన్న ప్రచారం జరిగింది. గతంలో జాన్వీ కూడా విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ అంటూ ప్రస్థావించటం తో జాన్వీ విజయ్ జోడిగా నటించటం కన్ఫార్మ్ అని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం లో నటించడం లేదని జాన్వీ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో జాన్వీ కాకపోయినా బాలీవుడ్ నటినే హీరోయిన్గా తీసుకోవాలని భావించిన చిత్రయూనిట్ మరో స్టార్ వారసురాలు అనన్య పాండేను తీసుకోవడం జరిగింది. ముంబైలో ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఈ మధ్యే పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగొచ్చింది.కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం విరామం తీసుకున్న అనన్య పాండే ఒక టీవీలో ప్రసారమయ్యే షోలో తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ను తనకు అతిపెద్ద పోటీగా భావిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నటీనటులు పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం సులభం అని కానీ తర్వాత తమని తాము నిరూపించుకోవాలని రణబీర్ కపూర్ అలియా భట్ వంటి నటులు సినీ కుటుంబాల నుండి వచ్చి నిరూపించుకున్నారన్నారు. ప్రతిభావంతులైన రణవీర్ సింగ్ మరియు అనుష్క శర్మ లాంటి వారు కష్టపడి వచ్చారని తన అభిప్రాయాన్ని తెలియజేసారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...