నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

Carona-Virus-Effect-on-Nithin-Marriage-Andhra-Talkies
నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

నితిన్ పెళ్లికి కరోనా ఎఫెక్ట్... వేదిక మారుతుందా?

టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులకు కొదవ లేదు. ఇటీవల ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఈ మధ్యనే తన సీక్రెట్ లవ్ ను ఓపెన్ చేసి.. తన పెళ్లి ముచ్చటను చెప్పేశారు హీరో నితిన్. పెద్దలు నిర్ణయించినట్లుగా ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్ కింద దుబాయ్ లో చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే.. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. దుబాయ్ లో పెళ్లి అనుమానంగా మారింది.

దీంతో.. పెళ్లి డేట్ మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. నితిన్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లిని అనుకున్న తేదీన.. అనుకున్న ముహుర్తానికి జరపాలని డిసైడ్ అయ్యారట. కరోనా కారణంగా దుబాయ్ లో పెళ్లి ఇబ్బందిగా మారితే.. దాన్ని హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు.ముందుగా అనుకున్న దాని ప్రకారం నితిన్ పెళ్లి దుబాయ్ లోని ప్రఖ్యాత హోటల్ ప్లహేజో వర్చసలో జరగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పెళ్లి దుస్తుల్ని కంచి.. చెన్నైలలో షాపింగ్ పూర్తి చేశారు. అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరుగుతుందని.. కాకుంటే వేదికలో మార్పు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక.. వివాహ అనంతరం గ్రాండ్ రిసెప్షన్ మాత్రం ఏప్రిల్ 21న హైటెక్స్ లో నిర్వహించనున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...