కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట


కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట

China-Virus-Corona-HelpS-For-That-Heoine-Andhra-Talkies
కరోనా వైరస్ ఆ హీరోయిన్ కి మేలు చేసిందంట
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ప్రజలు గడప దాటి బయటకి రావాలంటే పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ప్రభావం చూపింది. ముఖ్యంగా కోట్ల రూపాయల లావాదేవీలతో కూడిన సినీ రంగం మీద మరింత ఎఫెక్ట్ చూపింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సినీ నటులు తమ సినిమా షూటింగ్ లను అర్ధాంతరంగా ముగించుకొని ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది సెలబ్రెటీలు అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోని ఒక భామకు మాత్రం మేలే చేసిందంట.

వివరాల్లోకి వెళ్తే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్న ఒక యువ కథానాయకి కరోనా వల్ల షూటింగులు నిలిచిపోయి విరామం దొరకడంతో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుందంట.తెలుగుతో పాటు దక్షిణాదిలోని పలు భాషల్లో క్షణం తీరిక లేకుండా నటిస్తున్న ఈ హీరోయిన్ కి కరోనా వైరస్ పుణ్యమా అని తన బాయ్ ఫ్రెండ్ తో గడపడానికి టైం దొరికిందని తెగ సంబరపడిపోతుందంట. టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అందం అభినయం కలబోసిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బిజినెస్ మ్యాన్ అయిన తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదట ఈ విషయాన్ని ఖండించిన ఈ హీరోయిన్ తర్వాత రోజుల్లో తన లవ్ ఎఫ్ఫైర్ గురించి అంగీకరించింది. ఏది ఏమైనా కరోనా వల్ల బాధింపబడిన వారితో పాటు ఇలా మేలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారని వీరిని చూస్తే అర్థం అవుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...