రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

Did-you-Ever-Imagine-Regina-Like-This-Andhra-Talkies
రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

రెజీనా ఆ పాత్రకు సెట్ అవ్వలేదా?

చెన్నై బ్యూటీ రెజీనా కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఐదారేళ్లుగా బండి నడిపిస్తున్నా.. ఏదీ అంత ఈజీగా లేదు. ఈ అమ్మడు నటించిన ఏ సినిమా సరైన విజయం సాధించలేదు. అయినా ప్లాప్ లతో సంబంధం లేకుండా అవకాశాలు ఒడిసిపట్టుకుంది. కానీ ఎందుకనో టైమ్ మాత్రం కలిసిరాలేదు. ఇన్నాళ్లు గ్లామర్ అవకాశాలిచ్చినా.. ఇటీవలే సిసలైన పెర్ఫామెన్స్ కి సంబంధించిన టెస్ట్ మొదలైంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో సొంత గూటి(కోలీవుడ్)కి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా కోలీవుడ్ పైనే దృష్టి నిలిపింది. లక్కీగా మాతృభాష తనని బాగానే ఆదుకుంటోందని చెప్పాలి.ప్రస్తుతం తమిళంలో రెజీనా నాలుగైదు సినిమాలు చేస్తోంది. తెలుగు ప్రేక్షకుకులకు ఎలాగూ సుపరిచితురాలు కాబట్టి అవన్నీ ఇక్కడా అనువాదమయ్యే అవకాశం ఉంది. రెజీనా ప్రధాన పాత్రలో `నేనేనా` అనే ఓ థ్రిల్లర్ ప్రస్తుతం తెరకెక్కుతోంది. `నిను వీడని నీడను నేను` ఫేం కార్తీక్ సుబ్బరాజ్ తెలుగు- తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రెజీనా ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తుంది. తాజాగా రెజీనా యువరాణి లుక్ ఒకటి లీకైంది. పురాతన బంగ్లా ద్వారంపై రెజీనా రాణి లుక్ ఛాయాచిత్రమిది. ఆర్ట్ లుక్ ఎలా ఉంది? అంటే దానిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెజీనా లుక్.. ఆ గెటప్ మాత్రం ఏ మాత్రం తనకు సెట్ కాలేదని విమర్శలు వస్తున్నాయి. యువరాణి అంటే రాచరిక పోకడ ఉట్టిపడేలా ఉండాలి. కళ్లలో రౌద్రం..గాంభీర్యం.. ఒక రకమైన తేజస్సు కనిపించాలి. కానీ రెజీనా లుక్ లో అవన్నీ కొరవడ్డాయి. మరి ఆ పాత్ర ఆహార్యంలో రెజీనా సూటు కాలేదా? ఆర్ట్ డిజైనింగ్ సరిగ్గా లేదా? అన్నది సెకెండరీ. గతంలో త్రిష నాయకి సినిమాతో ఇలాంటి ప్రయత్నమే చేసి చేతులు కాల్చుకుంది. ఆ పాత్రకు త్రిష ఏమాత్రం సెట్ కాలేదని విమర్శలు ఎదుర్కుంది. యువరాణి లాంటి పాత్రలు పోషించాలంటే మంచి ఎత్తు..బరువు..శరీరం రూపం అన్ని కుదరాలి. ఆఛాన్స్ టాలీవుడ్ లో ఇప్పటికైతే అనుష్కకు మాత్రమే ఉంది. ఆ తర్వాత నయనతారకు మాత్రమే ఆ సీన్ ఉంటుందేమో!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...