శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?


శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?  

Director-Puri-Jagannath-With-Nagarjuna-During-Shiva-Movie-Andhra-Talkies
శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా? 
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ సంచలనాల గురించి తెలిసిందే. నైన్టీస్ లో గ్రేట్ మ్యూజికల్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున డీసెంట్ పెర్ఫామెన్స్ కి ఫిదా కాని వాళ్లు లేరు. ఇక ఇళయరాజా మాస్టర్ క్లాస్ మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే. ఇక నాగార్జున బ్యాచ్ లో నటించిన స్నేహితులు అందరూ టాలీవుడ్ లో దశాబ్ధాల పాటు స్టార్లుగా వెలిగారు.

అదంతా సరే కానీ.. శివ గ్యాంగ్ లో చైన్ తెంచి ఫైట్లు చేసే బ్యాచ్ లో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ ఉన్నారా?  ఒకవేళ ఉంటే తెలుగు వెర్షన్ లో ఎక్కడా కనిపించలేదేమిటి?  తాజాగా రివీలైన `శివ` మూవీ క్లాసిక్ ఫోటోలో పూరి ఆ గ్యాంగ్ లో కనిపించారు? ఇదెలా సాధ్యం? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే విషయం ఆరా తీస్తే పూరీకి సంబంధించిన చాలా విషయాలు తెలిశాయి. ఈ మూవీకి పూరి కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే. ఆర్జీవీ వద్ద శిష్యుడిగా పని చేశారు. అయితే శివ హిందీ వెర్షన్ రీమేక్ కి మాత్రం శివ గ్యాంగ్ లో పూరి కూడా ఓ చిన్న పాత్రలో నటించేశారట. ఇక పూరీ తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలో ఇలా మెరిసి అలా వెళ్లిపోతుంటాడన్న సంగతి తెలిసిందే.ఆర్జీవీ- మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్లు తమ శిష్యులనే హీరోలుగా పెట్టి సినిమాలు తీసేసే బ్యాచ్. అలాంటి ఓ రేర్ ఛాయిస్ కొందరికి కలిసొస్తుంది. ఇక పూరికి చిన్న ఆఫర్ దొరికిందన్నమాట. నాగార్జున వెంటే ఆ గ్యాంగ్ లో కనిపిస్తున్న పూరి యువకుడిగా ఇస్మార్ట్ శంకర్ లానే కనిపిస్తున్నాడు. చారల చొక్కాయ్.. జీన్స్ ఫ్యాంటు.. దానికి బ్రౌన్ బెల్టు.. బ్లాక్ నెక్ బనియన్ తో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఇక గుబురుగా పెరిగిన గడ్డం.. పక్క పాపిడితో పొడవుగా ఎదిగిన జుట్టు.. చూస్తుంటే రగ్గ్ డ్ గానూ కనిపిస్తున్నాడు. ఆ ఫేస్ లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...