కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల


కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Director-Sekhar-Kammula-On-Corona-Virus-Andhra-Talkies
కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు సూచిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం కరోనాకి భయపడకుండా తన మూవీ షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సున్నితమైన కథలను తన స్టైల్ లో చూపించే శేఖర్ కమ్ముల.వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్ ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఫిదా' లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. ఈ క్రమంలో కరోనాను పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్నగర్లో జరుగుతుండగా నాగ చైతన్య సాయి పల్లవిలపై చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ లోని ఒక సభ్యుడు తెలియజేసాడు.

2 comments:

 1. ఏమి "జాగ్రత్తలు" తీసుకున్నారట? మాస్క్ తగిలించుకోవడం ఒకటేనా జాగ్రత్తంటే ... షూటింగుకు అవసరం అయ్యే అంత మంది సిబ్బందిని అయితే పెట్టుకోవాలిగా? మరి అంత మంది మనుషులు చేరిన చోట ప్రమాదం లేకుండా ఎలా ఉంటుంది?

  ఈ డైరెక్టర్ అంటే కాస్తో కూస్తో గౌరవం ఉండేది. కానీ ఇతను కూడా బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తున్నాడు. వ్యాపార అవసరాలను మాత్రమే పట్టించుకుంటున్నాడన్నమాట?

  స్టేజ్ ఎక్కి పాడటమే కాక పెద్ద పార్టీ కూడా ఇచ్చిందంటున్న బాలీవుడ్ గాయని కనికా కపూర్, విదేశం నుండి వచ్చి క్వారంటైన్లో ఉండకుండా అట్టహాసంగా పెళ్ళి చేసుకున్నాడన్న యువకుడు (ఈ రోజు టీవీ వార్తల ప్రకారం), వైజాగ్ లో ఒక పే..ద్ద.. బట్టల షాపు ఈ టైములో భారీ డిస్కౌంట్ (60% అని నేను విన్నది) ప్రకటించి, జనాలు విరగబడి వచ్చి తన షాపులో గుమిగూడేందుకు కారణమయిన ఆ షాపు యజమాని, స్కూళ్ళు కాలేజీలు మూసెయ్యాలని ప్రభుత్వం ఆర్డర్ వేస్తే ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చెయ్యకుండా క్లాసులు నిర్వహిస్తున్న విద్యావ్యాపారులు ..... ఏమవుతోంది ఈ దేశం, ఎటు వెడుతున్నాం మనం? మేరా భారత్ మహాన్ అని పాడుకోవటమేనా?

  ReplyDelete

 2. ఎంత ముఖ్యమైన సమాచారం దేశానికి ఉపయోగ పడే సమాచారం తెలియ చేసే రండి. మిమ్మల్ని ఎట్లా పొగడాలో తెలియకుండా వుందండి. అందుకోండి వేయి వీరత్రాళ్ళు .


  జిలేబి

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...