నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ

నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ

Hero-Vijay-Devarakonda-Heroin-Sensational-On-Dating-Andhra-Talkies
నాలుగేళ్ల డేటింగ్ సంగతి బయటపెట్టిన విజయ్ దేవరకొండ భామ
సినీ రంగ ప్రముఖులు కానీ.. సెలబ్రిటీల తో మాట్లాడే సమయంలో వారి నుంచి వచ్చే సమాధానాలు ఎలా ఉన్నా.. మనం అడిగాం.. వారు చెప్పారన్నట్లుగా ఉంటుంది. మనం అడుగుతున్న విషయాలకు సంబంధించి వారు చెప్పే సమాధానాల వెనుక అసలు నిజం తెలిసినా.. తెలీనట్లుగా రాసుకోవటం మీడియాలో పని చేసే వారికి అనుభవమే. కొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నమైన అనుభవం ఎదురవుతుంది. అలాంటి అనుభవమే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో విజయ దేవరకొండతో జతకట్టిన బ్రెజిల్ భామ ఇజాబెల్లే తో మాట్లాడినప్పుడు కలుగుతుంది.

ఉన్నది ఉన్నట్లుగా.. పెద్దగా దాచి పెట్టుకోకుండా ఓపెన్ అయ్యే ఈ బ్యూటీ తాజాగా ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. ప్రేమ మాటను ప్రస్తావించినంతనే.. హీరోయిన్ల నోటి నుంచి రోటీన్ గా వచ్చే జవాబుకు భిన్నంగా ఇజాబెల్లే చెప్పింది. తానిప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదని.. కాకుంటే చదువుకునే రోజుల్లో మాత్రం ఒక వ్యక్తితో నాలుగేళ్లు డేటింగ్ చేసినట్లు చెప్పింది.తర్వాత అభిప్రాయాలు కలవలేదని బ్రేకప్ అయ్యిందని చెప్పింది. అప్పట్లో విడిపోవటం బాధ కలిగించినా.. ఇప్పుడు తనకు మంచే జరిగిందన్న భావన ఉందన్న ఆమె.. అప్పటి నుంచి తాను సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. మరో రెండు.. మూడేళ్ల వరకూ పెళ్లి చేసుకునే ఆలోచన లేదంది. ఎలాంటోడు కావాలన్న ప్రశ్నకు తానిప్పుడు ఆ విషయం గురించి ఆలోచించట్లేదని చెప్పింది. కాకుంటే.. నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులంటేఇష్టమని.. జీవితభాగస్వామికి ఆ రెండు గుణాలు తప్పనిసరిగా ఉండాలంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...