ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

Heroin-Kajal-does-not-give-any-discount-for-Teja-Andhra-Talkies
ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

ఔట్ డేటెడ్ హీరోయిన్ కి అంత అవసరమా?

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అయ్యింది. స్టార్ హీరోయిన్ గా చాలా సంవత్సరాలు వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఈమద్య కాలంలో కాస్త ఫేడ్ ఔట్ అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో మినహా మరే సినిమాలో కూడా ఈమె నటించడం లేదు. అయినా కూడా ఈ అమ్మడు తన పారితోషికంను తగ్గించుకోవడం లేదు. తన వద్దకు వచ్చిన నిర్మాతలకు భారీ పారితోషికం చెప్పి భయపెడుతుంది అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తాజాగా ఈ అమ్మడికి తేజ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా రూపొందబోతున్న అలిమేలుమంగ వెంకటరమణ చిత్రంలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే మూడు సార్లు తేజ దర్శకత్వం లో నటించిన కాజల్ మరోసారి నటించడం కన్ఫర్మ్ అయ్యిందని అనుకుంటున్న సమయం లో ఆ సినిమాలోకి గోపీచంద్ కు జోడీగా మరో హీరోయిన్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ ఏకంగా రెండు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేసిందట.ఔట్ డేటెడ్ హీరోయిన్ కు అంత పారితోషికం ఎందుకు అంటూ దర్శక నిర్మాతలు ఆలోచించుకుని అంతే పారితోషికం ఇస్తే ప్రజెంట్ స్టార్ హీరోయిన్ వస్తుంది కదా అని ఆలోచించారట. అందుకే కాజల్ ను తప్పించి కీర్తి సురేష్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయిన అవకాశాలు లేక దిక్కులు చూస్తున్న కాజల్ మరీ రెండు కోట్లు డిమాండ్ చేయడం ఏంటీ విచిత్రంగా అంటూ నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...