వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..

వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..

How-Saif-Ali-Khan-earned-back-the-Rs-800-crore-ancestral-Pataudi-Palace-Andhra-Talkies
వారసత్వ సంపదగా 800కోట్లు కొల్లగొట్టిన హీరో..
సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ లో ఎంతటి పేరును కలిగి ఉన్నాడో.. అంతటి ఆస్తిని కూడా కలిగి ఉన్నట్లు ఇటీవలే తెలిసింది. పటౌడీ రాజుల వంశానికి చెందిన సైఫ్ ప్రస్తుతం పట్టాభిషిక్తుడై రాజు గా నియమితుడయ్యాడు. ఏంటి ఎప్పుడో గడిచిపోయిన పటౌడీ వంశ రాజుల గురించి ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే. సైఫ్ అలీఖాన్ తాత ఇఫ్తీకర్ అలీఖాన్ దశాబ్దాల పాలన అనంతరం పటౌడీల వంశంలో చివరివాడిగా పేరొందాడు. అయితే ఇప్పుడా వంశ వారసుడు సైఫ్ అలీఖాన్ కు ఈ మధ్యే వారి వంశ రాజరికం దక్కింది.

అవును. ప్రస్తుతం పటౌడీల వంశ వారసుడు సైఫ్ మాత్రమే. పటౌడీల వంశంలోని పూర్వికులు దశాబ్దాల క్రిందట భారతదేశంలో పరిపాలన సాగించినప్పుడు పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా సంపాదించి పెట్టారు. స్వాతంత్ర్యానికి ముందు చివరిగా పటౌడీల వంశ రాజు ఇఫ్తీకర్ అలీఖాన్. ఆయన పరిపాలనలో ఆస్తులతో పాటు భారీ అంతస్తులను కూడా నిర్మించారు. అందులో ఒకటి గుర్గావ్ లోని పటౌడీ ప్యాలెస్. రాజవంశీయుల ప్యాలెస్ కాబట్టి సుమారుగా 15ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం.అద్భుతమైన నిర్మాణ శైలితో పదుల సంఖ్యలో గదులు కలిగి ఉన్నట్లు చెప్తున్నారు. పటౌడీలకు ఆ ప్యాలెస్ వారసత్వంగా వస్తున్న సంపద. దాని విలువ 800కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతటి విలువ కలిగిన పటౌడీ ప్యాలెస్ రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ కు వారసత్వ సంపదగా దక్కింది. ఇంతకాలం ఆ ప్యాలెస్ లో కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయట. మరి సినిమాలలోనే కాదు సైఫ్ ఆస్తుల పరంగా కూడా సంపన్నుడయ్యాడని అందరూ భావిస్తున్నారు. ఏదైతేనేం కోట్లు కొల్లగొట్టిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం రాజరిక పట్టాభిషేకం పొందినట్లే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...