నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో

నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో

Implications-For-The-producers-Because-Of-star-hero-Andhra-Talkies
నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న స్టార్ హీరో
ఆ స్టార్ హీరో వల్ల నిర్మాతలకు చెమటలు పట్టేయడం గ్యారెంటీ. ఏదో ఒక విషయంలో రెగ్యులర్ గా లొల్లు పెడుతూ సదరు హీరో గారు వేసే వేషాలకు ఏం చేయాలో పాలుపోని సన్నివేశం ఎదురవుతోందట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అన్నది అటుంచితే .. అతడితో నిర్మాతలకు ఇంకా ఎలాంటి చిక్కులు వచ్చి పడుతున్నాయి? అని ఆరాతీస్తే.. అబ్బో .. ఒకటా రెండా? బోలెడన్ని ఉన్నాయి.

సదరు హీరో ఇప్పటికే పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు నడిపాడు. రకరకాల వివాదాల్లో చిక్కుకున్నాడు. లవ్ బ్రేకప్ తో పాటు కెరీర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని సమయానికి షూటింగుకి వెళ్లకుండా ఏడిపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి సినిమా అంతా అయిపోయాక ప్రమోషన్స్ కి రమ్మంటే ఎగ్గొట్టేస్తాడు. అతగాడి క్రమశిక్షణా రాహిత్యం వల్లనే కెరీర్ కూడా ఇప్పుడు డౌన్ ఫాల్ లో నడుస్తోంది. అయినా అతడు ఇప్పటికీ మారలేదుట. ఇంకా నిర్మాతల్ని ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. యాటిట్యూడ్ చూపిస్తూ నిత్యం నరకం పాల్జేస్తున్నాడట.అయితే సదరు హీరోనే నమ్మి ఓ డైరెక్టర్ కం నిర్మాత మాత్రం వరుసగా సినిమాలు చేస్తుంటాడు. అదికూడా బహుభాషా చిత్రాలు అనే పేరుతో అన్ని భాషల్లో నిర్మాతలకు ఎసరు పెట్టేస్తుంటాడట. ఇక వేరే షూటింగులు ఉన్నాయంటూ సదరు హీరో నిర్మాతలకు టోపీ పెట్టి.. అసలు షూటింగును ఎగ్గొట్టేస్తుంటే నిర్మాతలకు ఏడుపొక్కటే మిగుల్తోందట. ఇంతేనా రకరకాల ఆర్థిక వ్యవహారాల్లో ఆ స్టార్ హీరో కోర్టులు గొడవలు అంటూ తిరుగుతుంటే అన్ని రకాలుగా నరకం కనిపిస్తోందట.

అందుకే ఇండస్ట్రీలో ఎవరైనా రాణించాలంటే క్యారెక్టర్ క్లీన్ గా ఉండాలని అంటారు. లేదంటే తనతో కమ్యూనికేషన్ పెట్టుకున్న అందరికీ ఇబ్బందులు తప్పదు. అందుకే ఇక్కడ ఇండస్ట్రీ క్యారెక్టర్ ని నిశితంగా పరిశీలిస్తుంటుంది. ఎందుకొచ్చిన తలనొప్పి అని వివాదాస్పదులను సైడేసేస్తుంటారు చాలా మంది. ఒకరకంగా సదరు స్టార్ హీరో తనకు బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఇన్నాళ్లు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సర్వైవ్ అయ్యాడు. ఆ ఒక్కటీ లేకపోతే ఎప్పుడో అయిపోయేవాడన్న కామెంట్లు ఉన్నాయి. కనీసం ఇన్ని చూశాక అయినా ఆ హీరోగారు మారతాడా! అంటే కుక్క తోక వంకర అని లైట్ తీస్కోవాల్సిందేనట.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...