#PSPK26 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నచ్చనిది ఇదే!

No-Hungama-Over-Vakeel-Saab-First-Look-Andhra-Talkies
#PSPK26 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నచ్చనిది ఇదే!

#PSPK26 పవన్ కి నచ్చనిది ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీలో నటిస్తున్నారు అంటే ఫ్యాన్స్ లో హంగామా తెలిసిందే. ఆయన బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు అంటే ఫ్యాన్స్ కి పండగే. పైగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడంటే ఆయన సినిమా కోసం ఎంతగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారో అంచనా వేయొచ్చు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్ 26వ సినిమాగా బాలీవుడ్ సూపర్ హిట్ `పింక్`ని రీమేక్ చేస్తున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ఇటీవల పవన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. తన సమాను సర్దుకుని ఓ చిన్న లారీలో బయలుదేరి వెళ్లిపోతున్న వకీల్ సాబ్ ఆ లారీలో రిలాక్స్ డ్ గా పడుకుని బుక్ చదువుకుంటున్నాడు. ఈ ఫస్ట్ లుక్ కి కొందరు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నా.. మెజారిటీ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ ని నిండుగా పోస్టర్ పై చూడాలనుకున్న అభిమానులు తాజా లుక్ ని చూసి అసంతృప్తి చెందుతున్నారు. దీంతో వకీల్ సాబ్ పై చాలా వరకు నెగటివ్ కామెంట్స్ వినవస్తున్నాయి.

అయితే పవన్ కి సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా చెవులు కోసుకునే అభిమానులు మరో విషయంలోనూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్యాప్ తో ఆయన కంబ్యాక్ అవుతున్నారు కాబట్టి.. `వకీల్ సాబ్` లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది. దీంతో అది తెలుగు చిత్ర పరిశ్రమలోనే అత్యధిక మంది చూసిన లుక్ ఇదేనంటూ చిత్రబృందం భజన ప్రారంభించింది. అత్యధిక మంది సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన లుక్ గా నిలిచిందనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే పవన్ మాత్రం ఇలాంటివి పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. ఆయన రికార్ట్ లు అన్న మాటకే దూరంగా ఉంటారు. ప్రచార ఆర్బాటాలు కోరుకోరు. చాలా వరకు సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. పైగా ఫెయిల్యూర్స్ తర్వాత వస్తున్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలాంటి హైప్ తీసుకు రాకుండా ఉండాలని ఆయన భావిస్తున్నారట. మరి తాజాగా వ్యూస్ విషయంలో సదరు పీఆర్ టీమ్ చేసే హడావుడి పట్ల ఆయన అసంతృప్తి గానే ఉన్నారని ఓ లీక్ అందింది. చాలా కూల్ గా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరోక్షంగా సిగ్నల్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో అంజలి- నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా మేలో విడుదలకు టీమ్ ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు క్రిష్ దర్శకత్వం లో తన 27వ సినిమాని చేస్తున్నారు. ఇది కూడా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వం లో మరో సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చిన విషయం విదితమే. ఇది పవన్ నటించే 28వ చిత్రం కావడం విశేషం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...