ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

Sexy-Heroin-Avika-Gor-Beauty-Looks-Andhra-Talkies
ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

ఫేడవుట్ బ్యూటీ ఎంత చేసినా ఏం లాభం?

బుల్లితెరపై బాలనటిగా ఓ వెలుగు వెలిగి అటుపై పెద్దతెరపైకి ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. రాజ్ తరుణ్ `ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తరవాత వరుసగా సినిమాల్లో నటించింది. అయితే సెంటిమెంటు పరిశ్రమకు కావాల్సిన హిట్టు లేకపోవడంతో అవకాశాలు లేకుండా పోయాయి. అలా అవికా గోర్ పరిశ్రమకు దూరమైంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఏం చేస్తోంది? అంటే ఇటీవల పూర్తిగా జిమ్ కే అంకితమైపోయిందట. బొద్దుతనం నుంచి మారేందుకు చాలానే మేకోవర్ ట్రై చేసింది. తాజాగా రివీల్ చేసిన ఫోటోలు చూశాక అభిమానులు షాక్ తినాల్సిందే. అసలు ఆ బొద్దుగుమ్మనేనా.. ఇంతగా ఛేంజైంది? అని షాక్ తింటున్నారంతా. పూర్తిగా చబ్బీ లుక్ నుంచి మారిపోయి వారెవ్వా అనిపిస్తోంది.

తాజా ఫోటోషూట్ లో అవికా ఎంతో స్మార్ట్ గా కనిపిస్తోంది. అన్నట్టు ఈవిడ అవికాయేనా? అని డౌట్లు పుట్టుకొచ్చేలా ఆ ఐ లైనర్ .. షేడ్స్ చిక్ షేప్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు పూర్తిగా షేక్ చేసేందుకే బాడీని షేపప్ చేసిందని అర్థమవుతోంది. అయితే ఇంత శ్రమించినందుకు ఇప్పటికిప్పుడు టాలీవుడ్ లో అవకాశం ఇచ్చేది ఎవరు? అంటే ఇంకా సమాధానం రావాల్సి ఉంది. అన్నట్టు అప్పట్లో ఈ అమ్మడు కో-టీవీ ఆర్టిస్టుతో ప్రేమలో పడిందని ప్రచారమైంది. అందులో పరిణతి ఎంత? అన్నది మాత్రం బయటకు తెలియడం లేదు.కొంత గ్యాప్ వచ్చినా ఈసారి కెరీర్ పై పూర్తిగా శ్రద్ధ పెడుతుందేమో చూడాలి. తెలుగులో రాజుగారి గది 3లో కనిపించింది. కన్నడలో నటసార్వభౌమ అనే హిట్ చిత్రంలో నటించింది. అయినా ఈ అమ్మడికి ఇటీవల ఛాన్సుల్లేవ్ ఎందుకనో!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...