మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

Suchitra-Krishnamoorthi-files-case-against-ex-husband-Shekhar-Andhra-Talkies
మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

మాజీ భర్తపై ప్రముఖ నటి కేసు

సుచిత్రా కృష్ణమూర్తి.. ప్రముఖ గాయని నటి రచయిత చిత్రకారిణి.. అన్ని రంగాల్లో అందెవేసిన చేయి గల బహుముఖ ప్రజ్ఞాశాలి. అయితే తాజాగా ఆమె తన భర్తపై కేసు పెట్టడం సంచలనమైంది.

1997లో ఆమె ప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కపూర్ ను వివాహమాడారు. వీరికి కావేరి అనే కూతురు కూడా ఉంది. ఆమె కూడా తల్లి బాటలో సంగీతరంగంలో రాణిస్తోంది.

తాజాగా ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న పడకగదుల ఫ్లాట్ లో నటుడు కబీర్ బేడి భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఈ ఫ్టాట్ తన మాజీ భర్త శేఖర్ కపూర్ కు చెందిందని.. చట్ట ప్రకారం ఈ ఫ్టాట్ తమ కుమార్తె కావేరికి చెందుతుందని సుచిత్ర వాదిస్తోంది. నాలుగేళ్లుగా కబీర్ బేడిని ఇళ్లును ఖాళీ చేయాలని ఆమె కోరుతోంది. వాళ్లు ఖాళీ చేయకపోవడంతో తాజాగా ఆమె కోర్టును ఆశ్రయించారు.

మాజీ భర్త నుంచి రావాల్సిన ఆస్తి కోసం న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు భర్త శేఖర్ కపూర్ కు నోటీసులు పంపించినా అతడు స్పందించకపోవడంతో కేసు పెట్టి కోర్టులో పోరాడుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...