ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?


ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?

Super-Star-Mahesh-Babu-No-More-Desirable-Man-Andhra-Talkies
ఆ లిస్టులో కనీసం సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు కూడా లేదా..?
ప్రముఖ వార్తాపత్రిక 'హైదరాబాద్ టైమ్స్' ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా "మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2019" జాబితాను విడుదల చేసింది. మహిళల విభాగం లో హీరోయిన్ సమంత మొదటి స్థానాన్ని పొందగా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో వరుసగా రెండోసారి నిలవడం విశేషం. అయితే హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన 30మంది 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు లేదు. అవును మీరు చదివింది నిజమే.

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ ఎంపికయ్యాడు ఓకే. కానీ అసలు 2012 2013 2015 సంవత్సరాలలో నెం.1 గా నిలిచిన మహేష్ బాబును లిస్టులోనే లేకుండా చేయడమే షాకింగ్. మహేష్ బాబు 2013లో ఇండియాకే మోస్ట్ డిజైరబుల్ పర్సన్ అలాంటి సూపర్ స్టార్ ని లిస్టులో నుండి తీసేయడం దారుణం అంటూ అభిమానులు బేజారవుతున్నారు. విజయ్ దేవరకొండ నెం.1 అయ్యాడు సరే కానీ మహేష్ బాబు పేరు కనీసం ముప్పై మంది లిస్టులో ఉండాలి కదా.. అని మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఈ ప్రశ్నకు హైదరాబాద్ టైమ్స్ పత్రిక ఇలా సమాధానమిచ్చింది. "నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబును మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ నుండి తప్పించడానికి కారణం ఆయన ఆల్రెడీ 'ఫరెవర్ డిజైరబుల్' లిస్టులో చేరడమే. ఇండియా లో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమిర్ ఖాన్ ల తర్వాత మహేష్ బాబుకే అందులో స్థానం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ లో చేరారు కాబట్టే ఇయర్లీ ఒకసారి మారే మోస్ట్ డిజైరబుల్ లిస్టులో నుండి ఆయన పేరును తొలగించినట్లు పత్రిక తెలిపింది. అంతేగాని ఈ విషయంలో మహేష్ అభిమానులు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్పడం కొసమెరుపు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...