రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?

రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?

Tollywood-Producers-Fear-On-Remake-Movies-Andhra-Talkies
రీమేక్ నిర్మాతలకు భయమేస్తోందా ?
టాలీవుడ్ లో ప్రస్తుతం అరడజను పైగా రీమేక్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో వెంకటేష్ నారప్ప పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' రామ్ 'రెడ్' నితిన్ 'అంధదున్' ఇలా పెద్ద లిస్టే ఉంది. అయితే మేకింగ్ లో ఉన్న ఈ రీమేకులు ఎంత వరకూ క్లిక్ అవుతాయనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మిగిలింది. దీనికి రీజన్ లేటెస్ట్ గా వచ్చిన కొన్ని రీమేక్స్ బోల్తా కొట్టడమే. వరుణ్ తేజ్ 'వాల్మీకి' బెల్లంకొండ 'రాక్షసుడు' మాత్రమే హిట్ అనిపించుకున్నాయి.

కెరీర్ లో ఇప్పటి వరకూ రీమేక్ చేయని దిల్ రాజు ఏరికోరి మరీ తమిళ్ క్లాసిక్ '96' సినిమాను తెలుగులో శర్వానంద్ సమంతల తో రీమేక్ చేసాడు. ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఒరిజినల్ దర్శకున్నే తీసుకున్నాడు కానీ రిజల్ట్ తేడా కొట్టింది. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' కూడా అంతే. ఎన్ని మార్పులు చేసి తీసినా సంక్రాంతి బరిలో ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇవే కాదు గతంలోనూ రీమేక్ సినిమాలు ఆడింది చాలా తక్కువే.అందుకే ఇప్పుడు రీమేక్ సినిమాల నిర్మాతలు భయపడుతున్నారు. రామ్ సినిమా విషయంలోనూ మేకర్స్ ఇలాగే భయపడుతూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కి టైం తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల రీమేక్ సినిమాలు కూడా ఏ మాత్రం తేడా కొట్టినా భారీ నష్టం వాటిల్లడం ఖాయం. మరి ఈ రీమేక్స్ వర్కౌట్ అయి బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకూ కలెక్ట్ చేస్తాయో వేచి చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...