కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!


కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!

Where-Does-Shriya-Saran-Stay-Andhra-Talkies
కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!
సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు అగ్రకథానాయకిగా వెలుగొందిన హీరోయిన్ శ్రియా సరన్. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ మహేష్బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రియ ఈ మధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. యంగ్ జనరేషన్ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడు సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆండ్రూతో కలిసి మ్యూజిక్ షోస్లో పాల్గొంటున్న శ్రియ..సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు నేను ఏమాత్రం తీసిపోనంటూ గుర్తు చేస్తూ ఉంటుంది.పెళ్లి తర్వాత తను ఎక్కడ సెటిల్ అయిందీ ఇప్పటి వరకు ఎక్కడ రెవీల్ చేయని శ్రియ..కరోనా నేపథ్యంలో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా బార్సిలోనాలో తన నివాసం ఉన్నట్లు తెలియజేయింది. స్పెయిన్ లోని ప్రధాన నగరమైన బార్సిలోనాలో ఈ అమ్మడు తన భర్తతో కలిసి రెండు రెస్టారెంట్లు నిర్వహిస్తుందంట. అప్పుడప్పుడప్పుడు డెహ్రాడూన్ లో తళుక్కుమనే ఈ భామ పెళ్ళైన వెంటనే బార్సిలోనా చెక్కేసి ఈ రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగిందంట. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తుండటంతో రెస్టారెంట్లుకు వచ్చే వారే లేకుండా పోయారంట. దీంతో రెస్టారెంట్లో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిసిన వాళ్ళ దగ్గర వాపోయిందంట. ఈ విషయం తెలుసుకున్న శ్రియ ఫ్యాన్స్ కరోనా ఎఫెక్ట్ త్వరగా పోయి తమ అభిమాన హీరోయిన్ మళ్ళీ పుంజుకోవాలని కోరుకుంటున్నారంట.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...