బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??


బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??

heroin-anushka-shetty-mega-chance-so
బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..?
'బాహుబలి' సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అరుంధతి పంచాక్షరీ భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. అయితే స్వతహాగా సౌమ్యురాలైన అనుష్క మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.మెగాస్టార్ తో సినిమా చేయాలని ప్రతీ హీరోయిన్ కు ఉంటుంది. ఆయనతో కలిసి ఒక చిన్న సీన్ చేసినా చాలు అనుకుంటారు. అలాంటిది స్వీటీ ఎందుకు ఇలా చేసిందా అని సినీ ఇండస్ట్రీలో అదే పనిగా చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే చిరంజీవి తన 152వ మూవీ 'ఆచార్య'లో నటించమని మొదట అనుష్కనే సంప్రదించారట. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లలో అసలు డైలాగ్స్ కూడా ఉండవని భావించిన స్వీటీ ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిందని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ నటించినా తనకు అంతగా ప్రాధాన్యత లేని ఈ సినిమా వల్ల ఫ్యూచర్ లో పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయన్న గ్యారంటీ లేదని వచ్చినా ఇలాంటి రోల్స్ వస్తాయని భావించి వదులుకున్నానని ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండే పలువురి దగ్గర చెప్పుకుందంట. మనకి పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చినా నచ్చిన పాత్ర చేస్తేనే హ్యాపీగా ఉంటదని నవ్వుతూ బదులిచ్చిందంట. ఇంతకుముందు త్రిష ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాజల్ ని హీరోయిన్ గా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏదైతేనేం ఈ విషయంలో స్వీటీ చాలా స్వీట్ గా ఆలోచించిందని చెప్పుకుంటున్నారు.

కాగా అనుష్క ప్రస్తుతం మాధవన్ తో కలిసి నటించిన 'నిశ్శబ్దం' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అనుష్క బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నటిస్తున్న చిత్రం కావడం తో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 'నిశ్శబ్దం' మూవీ అనుష్కా శెట్టికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...