సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!

Goa-Beauty-Ileana-Targets-Super-Seniors-Andhra-Talkies
సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ ఇలియానా. 'దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ - పూరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమాలో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో ఇల్లీ బేబీ తన నడుమందాలతో ఇక్కడి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రవితేజ వంటి హీరోలందరి సరసన యాక్ట్ చేసింది. ఓ పక్క ఇటు తెలుగు తమిళంలో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇల్లీ బేబీ అక్కడ కూడా అదరగొట్టింది. బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో మన తెలుగు సినిమాలను పక్కన పెట్టేసింది. తర్వాత రోజుల్లో అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూపు మళ్లించింది. ఎన్నో ఆశలతో రవితేజ హీరోగా తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశనే కలిగించింది. దీంతో ఛాన్సెస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ గోవా బ్యూటీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తోంది.

హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!

4-Movies-Ready-But-No-Release-Andhra-Talkies
హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!
ఆయనో యువ హీరో కం విలన్. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్టు రాలేదు.. కెరీర్లో బ్రేక్ కూడా రాలేదు. అలా అని అవకాశాలకు లోటేమీ లేదు. హీరోగా నటిస్తూనే విలన్ గా.. కీలకమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఒప్పుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్నాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ హీరో నటించిన నాలుగు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడంటే కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.. విడుదలకు అవకాశం లేదు. కానీ ఈ హీరో నటించిన ఆ నాలుగు సినిమాలు మాత్రం డిసెంబర్ నుంచే రిలీజ్ కు నోచుకోవడం లేదట.

ఈ సినిమాల నిర్మాతలు వేసవి సీజన్ పైనే ఆశలు పెట్టుకొని ఉన్నారట. ఈ సమ్మర్ లోనే డెడ్ వీకెండ్స్ చూసుకొని.. ఈ సినిమాలను విడుదల చేసే ప్లాన్ వేసుకున్నారట. కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఆ ప్లానింగ్ కాస్త తల్లక్రిందులుగా మారింది. ఆ నిర్మాతలకు రూపాయి కూడా డా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఈ నిర్మాతలు రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేందుకు ఛాంబర్ కు వెళ్ళిన సమయంలో "ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి నష్టాలు కొని తెచ్చుకుంటారు" అని మొహం పైనే చెబుతున్నారట.

కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!

Corona-Cause-Because-Of-5G-Towers--Hollywood-Star-Andhra-talkies
కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!
కరోనావైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ తాజాగా మరో భారీ బాంబు పేల్చాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు - పోస్టులపై ఇప్పుడు దృష్టిసారించారు. కరోనావైరస్కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే.. కరోనావైరస్ కు 5జీ నెట్ వర్క్ కు సంబంధం అంటగడుతూ హాలీవుడ్ యాక్టర్ హారెల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

కరోనా వ్యాప్తికి అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. బొడిగుండుకు మోకాలుకు లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనావైరస్ కు అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ ఊడీ హారెల్సన్ షేర్ చేసిన పోస్టులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైనాలో వుహాన్ తొలి 5జీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దాంతో ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్ హైవేగా పేరుతెచ్చుకొన్నది. అంతలోనే వుహాన్ లో ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందింది అని ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టులో పొందుపరిచాడు.

విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?


విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?

Popular-Hero-Upendra-Ready-For-Villain-Roles-in-Telugu-Movies-Andhra-Talkies
విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?
కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు విలన్లుగా చేసి హీరోలు అవ్వాలని ఆశ పడేవారు. ఇప్పుడు హీరోలు విలన్ వేషాలు వేయాలని ఆశ పడుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే విలన్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ కాస్త స్లోగా ఉంటే విలన్ గా ట్రై చేయడం లేదా హీరోగా అవకాశాలున్న సమయంలోనే పక్క భాషల్లో విలన్ గా చేయడం ఈ మధ్య హీరోలకు బాగా కలిసి వస్తోంది. స్టైలిష్ విలన్స్ గా - హీరోకు ఏమాత్రం తగ్గని స్టైల్స్ అండ్ క్యారెక్టర్ వెయిట్ తోనే నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పోషిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోలకు కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంటే - విలన్ గా సొంతభాషలో ప్రేక్షకులు ఒప్పుకోని హీరోలు పక్కభాషల్లో నెగటివ్ రోల్స్ లో రెచ్చిపోతున్నారు. హీరోలుగా డిజాస్టర్ల బాట పట్టి మళ్లీ విలన్ గా లైఫ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో మన టాలీవుడ్ లో తారకరత్న - జగపతిబాబు లాంటి వాళ్లుంటే - ఒక భాషలో హీరోగా చేస్తూనే మరో భాషలో విలన్ గా చేస్తున్నారు ఆది పినిశెట్టి - అరుణ్ విజయ్ - ఉపేంద్ర లాంటి వారు ఉన్నారు.

ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?


ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?

Tollywood-Producers-Interested-With-New-Heroines-Andhra-Talkies
ఆ హీరోయిన్లు దుకాణం సర్దాల్సిందేనా..?
హీరోయిన్... సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే - సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. తమ అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారు ఇంకొందరు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికొస్తే రోజుకో కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది. వాళ్లలో కొందరు అందం - అభినయంతో గుర్తింపు తెచ్చుకోగా - మరికొందరు ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోతుంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు.

కానీ కొంతమంది హీరోయిన్లు బ్యూటీతో పాటు తమ యాక్టింగ్ కలిపి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చిన వరుస అవకాశాలు సద్వినియోగం చేసుకోలేక - పాత్ర కంటే రెమ్యూనరేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ నుండి ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. హెబ్బా పటేల్ - శ్రద్ధాదాస్ - ప్రగ్యా జైస్వాల్ - రెజీనా కసాండ్ర - అను ఇమ్మాన్యుయేల్ లాంటి హీరోయిన్లు ఈ కోవకే చెందుతారు. వీరితో పాటు ఇంకా కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ నుండి తమ దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్


నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్

The-Heroine-Fires-On-Netigen-Andhra-Talkies
నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్
సోషల్ మీడియానే ఇప్పుడు ఆయుధమైంది. దాంతో నే తమ భావాలను అందరూ వ్యక్త పరుస్తున్నారు. సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. చిరంజీవి కూడా తాజాగా ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలోకి వచ్చాడు.

అయితే హీరోయిన్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయే నెటిజన్లు కోకొల్లలు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో ఓ నెటిజన్ అసభ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందే ఆ హీరోయిన్ ను 'నువ్వు వర్జినా కాదా' అని ప్రశ్నించాడు. దీంతో షాక్ కు గురైన హీరోయిన్ సంయుక్త అతడికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఓ రేంజ్ లో పైర్ అయ్యింది.

నీలాంటి వాళ్ల వల్లే అమ్మాయిలు ఆటబొమ్మలా కనిపిస్తున్నారు. మీరు వర్జినిటీ సెక్స్ ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీతోనే అమ్మాయిలకు డేంజర్ అంటూ నిప్పులు చెరిగింది సంయుక్త. అనంతరం చెడామడా తిట్టేసింది. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగులకొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుందని సంయుక్త వార్నింగ్ ఇచ్చింది.

2016లో మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకొని అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగింది.తమిళనాట కూడా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.

రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!


రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!

Plans-Of-Star-Heroes-Shattered-By-Corona-Andhra-Talkies
రాబోయే రోజుల్లో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ కష్టమే...!
కరోనా మహమ్మారి మూలంగా అందరి తలరాతలు మారుతూ వస్తున్నాయి. డబ్బున్నోడు పేదోడు మధ్య తరగతి అని తేడా లేకుండా అందర్నీ అల్లాడిస్తున్నది. ఇంక ప్రపంచ వ్యాప్తంగా దీని వల్ల అన్ని రంగాలకు నష్టం వాటిల్లింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మన దేశంలో కూడా చాలా ప్రభావం చూపింది. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వచ్చి మీద పడటంతో ఇప్పుడు అన్ని లెక్కలు మారి పోయాయి. ఒక్క సినిమా రిలీజ్ కి రెడీ చాలు అనుకుంటున్నారు.

ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..


ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..

Indian-Famous-Singer-Stucked-In-Italy-Andhra-Talkies
ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..
గాన గంధర్వుడు పండిట్ జస్రాజ్కు మనవరాలు ప్రముఖ సినీ గాయని శ్వేతా పండిట్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. నెలరోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం తో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మన దేశంలో కరోనా ప్రభావం లేనప్పటికీ.. ఇండియాకి వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. 'కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది గనక ఇటలీ నుంచి బయటికి రావడం బాధ్యతా రాహిత్యమే అవుతుందంటుంది శ్వేత. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణం అంత మంచిది కాదు. అందుకే నెల రోజులుగా ఇటలీలో శ్వేత ఉంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తుందట. ఇటలీలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోయి మళ్లీ ఆ సైరన్తోనే నిద్రలేస్తున్నానంటుంది శ్వేత. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదట. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?


.

సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?

Sexy-Heroin-Anushka-Not-Announced-Relief-Fund-for-TFI-Workers-Andhra-Talkies
సాయం చేయడానికి అనుష్క కి చేతులు రావా..?
మన టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. ఒక్కొక సినిమాకి రెండు నుండి మూడు కోట్లు తీసుకునే స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. కొంతమంది హీరోయిన్లు ఒక్క ఐటమ్ సాంగ్ చేస్తేనే కోటి రూపాయల దాకా డిమాండ్ చేస్తుంటారు. గెస్ట్ రోల్స్ చేయడానికి వాళ్ళు వసూలు చేసేది లక్షల్లోనే. ఇంత భారీ మొత్తంలో సంపాదించే హీరోయిన్లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఇప్పుడు సగటు అభిమానికి వస్తున్న డౌట్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తన పంజాను చూపెడుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు హీరోలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కానీ ప్రణీత - లావణ్య త్రిపాఠి మినహా మిగతా హీరోయిన్లు స్పందించక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...