హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!

4-Movies-Ready-But-No-Release-Andhra-Talkies
హీరో కం విలన్ గారి 4 సినిమాలు రెడీ.. రిలీజ్ సంగతి అడక్కండి!
ఆయనో యువ హీరో కం విలన్. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్టు రాలేదు.. కెరీర్లో బ్రేక్ కూడా రాలేదు. అలా అని అవకాశాలకు లోటేమీ లేదు. హీరోగా నటిస్తూనే విలన్ గా.. కీలకమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఒప్పుకుంటూ తన కెరీర్లో ముందుకు సాగిపోతున్నాడు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ హీరో నటించిన నాలుగు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడంటే కరోనా క్రైసిస్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.. విడుదలకు అవకాశం లేదు. కానీ ఈ హీరో నటించిన ఆ నాలుగు సినిమాలు మాత్రం డిసెంబర్ నుంచే రిలీజ్ కు నోచుకోవడం లేదట.

ఈ సినిమాల నిర్మాతలు వేసవి సీజన్ పైనే ఆశలు పెట్టుకొని ఉన్నారట. ఈ సమ్మర్ లోనే డెడ్ వీకెండ్స్ చూసుకొని.. ఈ సినిమాలను విడుదల చేసే ప్లాన్ వేసుకున్నారట. కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ఆ ప్లానింగ్ కాస్త తల్లక్రిందులుగా మారింది. ఆ నిర్మాతలకు రూపాయి కూడా డా వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. ఈ నిర్మాతలు రిలీజ్ డేట్ ఖరారు చేసుకునేందుకు ఛాంబర్ కు వెళ్ళిన సమయంలో "ఎందుకయ్యా ఇలాంటి సినిమాలు తీసి నష్టాలు కొని తెచ్చుకుంటారు" అని మొహం పైనే చెబుతున్నారట.ఇదిలా ఉంటే.. సదరు యువ హీరోకి కూడా ఈ సినిమాల విషయంలో అందరూ ఒకే సలహా ఇస్తున్నారట. ఎలాగూ ఈ సినిమాలు వర్కౌట్ అయ్యేలా లేవు కాబట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టాడు కాబట్టి వెబ్ సిరీస్ లు చూసుకుంటే భవిష్యత్తు ఉంటుందని సలహాలు ఇస్తున్నారట. అది సరేగాని ఈ సినిమా నిర్మాతలకు సంబంధించిన ఒక ట్విస్ట్ ఏంటంటే.. వీళ్ళందరూ రెండు రకాల ఆలోచనలతో సినిమాలు నిర్మిస్తున్నారట. మొదటి కేటగిరీ.. జీవితంలో ఒక సినిమా అయినా నిర్మించాలని కోరిక కలిగిన ఇన్వెస్టర్లు. రెండో కేటగిరీ.. హీరోయిన్లను మచ్చిక చేసుకొని అచ్చిక బుచ్చికలాడడానికి ఈ సినిమాలను అడ్డు పెట్టుకుంటున్నారట. వీరికి సినిమాకళ పట్ల ఉన్న ప్రేమ కన్నా రసికత పట్ల వ్యామోహం మెండుగా ఉందట. నిజానికి ఈ రెండు రకాల ప్రొడ్యూసర్లు చిన్నాచితక హీరోలను చూసుకోవడం.. వీలైనంత తక్కువ బడ్జెట్ తో ఏదో ఒక సినిమా నిర్మించడం చేస్తున్నారట. అది సంగతి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...