కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!

Corona-Cause-Because-Of-5G-Towers--Hollywood-Star-Andhra-talkies
కరోనాకు కారణం 5జీ టవర్లే : హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్!
కరోనావైరస్ తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ తాజాగా మరో భారీ బాంబు పేల్చాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు - పోస్టులపై ఇప్పుడు దృష్టిసారించారు. కరోనావైరస్కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే.. కరోనావైరస్ కు 5జీ నెట్ వర్క్ కు సంబంధం అంటగడుతూ హాలీవుడ్ యాక్టర్ హారెల్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి.

కరోనా వ్యాప్తికి అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ అంటూ చేసిన పోస్టు సోషల్ మీడియా లో వైరల్ అయింది. అయితే ఈ పోస్టుపై కొందరు స్పందిస్తూ.. బొడిగుండుకు మోకాలుకు లింకు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనావైరస్ కు అసలు కారణం 5జీ వైర్ లెస్ నెట్ వర్క్స్ ఊడీ హారెల్సన్ షేర్ చేసిన పోస్టులో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైనాలో వుహాన్ తొలి 5జీ స్మార్ట్ సిటీగా ఎంపికైంది. దాంతో ప్రపంచంలోనే తొలి 5జీ స్మార్ట్ హైవేగా పేరుతెచ్చుకొన్నది. అంతలోనే వుహాన్ లో ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందింది అని ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టులో పొందుపరిచాడు.ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో 5జీకి - కరోనాకు సంబంధం ఏమిటనే దిశగా అక్టోబర్ 31వ తేదీనే తొలి చర్చ జరిగింది. ఈ చర్చపై 5జీ స్మార్ట్ సిటీ వుహాన్ ప్రాణాంతక వ్యాధి కరోనాకు నిలయం అనే విధంగా కథనాలు ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత ఊడీ హారెల్సన్ షేర్ చేసిన రిపోర్టుపై విపరీతమైన చర్చ జరిగింది. అందులో అనేక సందేహాస్పద అంశాలు ఉండటంతో రిపోర్టు వాస్తవమెంత అనే దిశగా ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఊడీ హారెల్సన్ ఓ వీడియోను రిలీజ్ చేసి 5జీ నెట్ వర్క్ టవర్స్ గురించి మాట్లాడటం మరింత ఆసక్తిని రేపింది. ఈ క్రమంలో పలువురు ఊడీ హారెల్సన్ చేసిన పోస్టుపై కొందరు నిపుణులు సోషల్ మీడియాలో దాడి చేయడం కరోనాకు 5జీకి సంబంధం లేదని బల్లగుద్ది చెప్పారు. ఈ నేపథ్యంలో ఊడీ హారెల్సన్ తన పోస్టును తొలగించాడు. వివాదానికి కేంద్ర బిందువుగా ఆ పోస్ట్ ఉండటంతో తన పోస్టును డిలీట్ చేసి ఉంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...