సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!

Goa-Beauty-Ileana-Targets-Super-Seniors-Andhra-Talkies
సూపర్ సీనియర్లను టార్గెట్ చేసిన గోవా బ్యూటీ...!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ ఇలియానా. 'దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ - పూరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమాలో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది. ఆ సినిమాలో ఇల్లీ బేబీ తన నడుమందాలతో ఇక్కడి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ ప్రభాస్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రవితేజ వంటి హీరోలందరి సరసన యాక్ట్ చేసింది. ఓ పక్క ఇటు తెలుగు తమిళంలో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇల్లీ బేబీ అక్కడ కూడా అదరగొట్టింది. బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువలా వచ్చి పడటంతో మన తెలుగు సినిమాలను పక్కన పెట్టేసింది. తర్వాత రోజుల్లో అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూపు మళ్లించింది. ఎన్నో ఆశలతో రవితేజ హీరోగా తెరకెక్కిన 'అమర్ అక్బర్ ఆంటోని' మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ఆమెకు నిరాశనే కలిగించింది. దీంతో ఛాన్సెస్ కోసం సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పుడు ఈ గోవా బ్యూటీ తిరిగి ఫామ్ లోకి రావడానికి తెగ ట్రై చేస్తోంది.ఈ బ్యూటీ ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అయినప్పటికీ సీనియర్ హీరోలతో మాత్రం నటించలేదు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అప్పటి సీనియర్ హీరోలైన నాగ్ వెంకీ బాలయ్య చిరులతో కలిసి నటించడానికి ఇంటరెస్ట్ చూపించలేదు. అప్పట్లో ఇలియానా వాళ్ల పక్కన మరీ చిన్న పిల్లగా కనిపిస్తుందేమో అని ఆ నలుగురు హీరోలు కూడా ఈ బ్యూటీ పై కాన్సన్ ట్రేట్ చేయలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ సీనియర్ హీరోలతోనే నటించింది. ఇప్పుడు అక్కడ ఆఫర్లు లేక ఇక్కడ కూడా ఆఫర్లు లేక ఖాళీగా ఉంటోంది. అయితే ఈ బ్యూటీ మళ్లీ తెలుగులో సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఇల్లీ టార్గెట్ లోకి ఆ నలుగురు సూపర్ సీనియర్లు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ జల్సా చేసిన ఈ ముదురు ముద్దుగుమ్మ మరోసారి ఆయన సరసన కనిపించనుందని సమాచారం. ఏదేమైనా ఈ గోవా బ్యూటీ మళ్ళీ ట్రాక్ లోకి ఎక్కుద్దేమో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...