ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..


ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..

Indian-Famous-Singer-Stucked-In-Italy-Andhra-Talkies
ఇటలీలో ఇరుక్కుపోయిన ఇండియన్ ఫేమస్ సింగర్..
గాన గంధర్వుడు పండిట్ జస్రాజ్కు మనవరాలు ప్రముఖ సినీ గాయని శ్వేతా పండిట్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉంది. నెలరోజుల కిందట ఇటలీకి వెళ్లిన ఆమె రోజురోజుకి అక్కడ కరోనా వ్యాప్తి పెరుగుతుండటం తో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. మన దేశంలో కరోనా ప్రభావం లేనప్పటికీ.. ఇండియాకి వచ్చే అవకాశం ఉన్నా రాలేదు. 'కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది గనక ఇటలీ నుంచి బయటికి రావడం బాధ్యతా రాహిత్యమే అవుతుందంటుంది శ్వేత. ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణం అంత మంచిది కాదు. అందుకే నెల రోజులుగా ఇటలీలో శ్వేత ఉంటున్న ఇంట్లోంచి బయటకు రాకుండా కాలక్షేపం చేస్తుందట. ఇటలీలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ సైరన్ వింటూ నిద్రపోయి మళ్లీ ఆ సైరన్తోనే నిద్రలేస్తున్నానంటుంది శ్వేత. అంబులెన్స్ శబ్దం తప్ప ఇంకేదీ వినిపించడం లేదట. ఫ్రెండ్స్.. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ చెప్పే సూచనలు పాటించండి.


ఇంట్లోంచి బయటకు రాకండి. ఇవి మనకు కీలకమైన రోజులు అంటూ సందేశం ఇస్తుంది శ్వేత. పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ దుస్థితి మనకు రావద్దు' అంటూ అక్కడి విషయాలను వార్తలను తన క్వారంటైన్ కాలాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది. స్వదేశానికి రాకుండా ఉండిపోయిన శ్వేత నిర్ణయాన్ని పలువురు సినీప్రముఖులు రాజకీయనేతలు అభినందిస్తున్నారు. టాలెంటెడ్ సింగర్ శ్వేతా పండిట్ బాలీవుడ్తో పాటు తెలుగు తమిళ భాషల్లోనూ తన మాధుర్యమైన గానాన్ని వినిపిస్తోంది. నాలుగేళ్ల వయసులోనే మణిరత్నం 'అంజలి' తో సినిమాల్లో పాటల ప్రయాణం మొదలుపెట్టింది. తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ తో కలిసి తొమ్మిదో యేటనే సంగీత దర్శకరాలుగా పని చేసింది. ఈమె క్షేమంగా ఉండాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...