విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?


విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?

Popular-Hero-Upendra-Ready-For-Villain-Roles-in-Telugu-Movies-Andhra-Talkies
విలన్ వేషాలు వేయడానికి రెడీ అంటున్న స్టార్ హీరో..?
కాలంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు విలన్లుగా చేసి హీరోలు అవ్వాలని ఆశ పడేవారు. ఇప్పుడు హీరోలు విలన్ వేషాలు వేయాలని ఆశ పడుతున్నారు. స్టార్ హీరోలు సైతం ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర అయితే విలన్ రోల్ అయినా ఓకే అంటున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగి కెరీర్ కాస్త స్లోగా ఉంటే విలన్ గా ట్రై చేయడం లేదా హీరోగా అవకాశాలున్న సమయంలోనే పక్క భాషల్లో విలన్ గా చేయడం ఈ మధ్య హీరోలకు బాగా కలిసి వస్తోంది. స్టైలిష్ విలన్స్ గా - హీరోకు ఏమాత్రం తగ్గని స్టైల్స్ అండ్ క్యారెక్టర్ వెయిట్ తోనే నెగటివ్ షేడ్స్ అద్భుతంగా పోషిస్తున్నారు. ఫేడ్ అవుట్ అయిపోయే హీరోలకు కెరీర్ మళ్లీ ప్రారంభమవుతుంటే - విలన్ గా సొంతభాషలో ప్రేక్షకులు ఒప్పుకోని హీరోలు పక్కభాషల్లో నెగటివ్ రోల్స్ లో రెచ్చిపోతున్నారు. హీరోలుగా డిజాస్టర్ల బాట పట్టి మళ్లీ విలన్ గా లైఫ్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో మన టాలీవుడ్ లో తారకరత్న - జగపతిబాబు లాంటి వాళ్లుంటే - ఒక భాషలో హీరోగా చేస్తూనే మరో భాషలో విలన్ గా చేస్తున్నారు ఆది పినిశెట్టి - అరుణ్ విజయ్ - ఉపేంద్ర లాంటి వారు ఉన్నారు.


ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర విషయానికొస్తే అక్కడ హీరోగా బిజీగా ఉంటూనే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తూ వస్తున్నారు. ఆయన నటిస్తున్న ప్రతీ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తూ ఇక్కడ కూడా మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మధ్య తెలుగులో ఒక స్టార్ హీరో పక్కన డైరెక్ట్ తెలుగు సినిమాలో విలన్ గా చేస్తున్నానని ప్రకటించాడట. ఉపేంద్ర తెలుగులో యాక్ట్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈవీవీ 'కన్యాదానం' సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు కూడా. కానీ అది ఫుల్ లెన్త్ విలన్ రోల్ కాదు. అయితే ఇప్పుడు లేటెస్టుగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కంప్లీట్ విలన్ రోల్ చేయడానికి నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని సమాచారం. మరి ఉపేంద్రతో విలన్ రోల్ చేపించే గోల్డెన్ ఛాన్స్ ఏ దర్శకనిర్మాతలు ఉపయోగించుకుంటారో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...