నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్


నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్

The-Heroine-Fires-On-Netigen-Andhra-Talkies
నువ్వు వర్జినా అడిగిన వాడిపై హీరోయిన్ ఫైర్
సోషల్ మీడియానే ఇప్పుడు ఆయుధమైంది. దాంతో నే తమ భావాలను అందరూ వ్యక్త పరుస్తున్నారు. సినిమా ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో కనెక్ట్ అవుతున్నారు. చిరంజీవి కూడా తాజాగా ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లలోకి వచ్చాడు.

అయితే హీరోయిన్లను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో రెచ్చిపోయే నెటిజన్లు కోకొల్లలు. ఈ క్రమంలోనే తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో ఓ నెటిజన్ అసభ్యంగా ప్రవర్తించాడు. అందరి ముందే ఆ హీరోయిన్ ను 'నువ్వు వర్జినా కాదా' అని ప్రశ్నించాడు. దీంతో షాక్ కు గురైన హీరోయిన్ సంయుక్త అతడికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఓ రేంజ్ లో పైర్ అయ్యింది.

నీలాంటి వాళ్ల వల్లే అమ్మాయిలు ఆటబొమ్మలా కనిపిస్తున్నారు. మీరు వర్జినిటీ సెక్స్ ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీతోనే అమ్మాయిలకు డేంజర్ అంటూ నిప్పులు చెరిగింది సంయుక్త. అనంతరం చెడామడా తిట్టేసింది. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగులకొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుందని సంయుక్త వార్నింగ్ ఇచ్చింది.

2016లో మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకొని అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగింది.తమిళనాట కూడా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...