అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..

Bollywood-Hero-Amitabh-in-the-memory-of-old-beauty-Andhra-Talkies
అలనాటి అందాలనటి జ్ఞాపకాలలో అమితాబ్..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తన మిత్రులు తోటి నటులు అయినటువంటి దివంగత అందాల తార శ్రీదేవి టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ లను గుర్తుచేసుకుంటూ వారితో కూడిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. గతంలో శ్రీదేవితో నటించిన 'ఖుదాగవా' సినిమాను గుర్తుచేసుకొని.. నేను శ్రీదేవి కలిసి నటించిన ఈ సినిమా 1992 మే8 రోజున విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలై నిన్నటికి 28 సంవత్సరాలు పూర్తయింది. ఆమె ఎంతో గొప్ప నటి. కానీ ఇలా ఇంత త్వరగా ఈ లోకాన్ని సినీ లోకాన్ని విడిచి వెళ్తుందని ఊహించలేదు. ఆమె ఖుదాగవా సినిమా టైంలో ఎంత సౌమ్యంగా ఉందో.. మరణించే వరకు అలాగే ఉందని తెలిపి ఖుదాగవా సినిమాలోని ఓ ఫోటో షేర్ చేశారు.

ఇక రీసెంట్ గా ఇద్దరు టాప్ యాక్టర్లను కోల్పోయి బాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఆ బాధలో నుండి కోలుకోలేదు. అందులో ఇర్ఫాన్ ఖాన్ గురించి బిగ్ బి గుర్తుచేసుకుంటూ.. తనతో వర్క్ చేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మే8న నేను ఇర్ఫాన్ కలిసి నటించిన 'పీకూ' సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ప్రస్తుతం ఇర్ఫాన్ మనతో లేరు. వెరీ టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పారు. ఇర్ఫాన్ కూడా ఆకస్మాత్తుగా లోకాన్ని విడిచి మనందరినీ బాధలోకి నెట్టేసి వెళ్లిపోయారు. కానీ వారి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయంటూ బిగ్ బి తెలిపారు. అందాల నటి శ్రీదేవి ఇర్ఫాన్ ఖాన్ లతో దిగిన స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు అమితాబ్. ఇద్దరు లెజెండ్స్ ని కోల్పోవడం బాధాకరమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...