భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!

Hero-jr-NTR-preparing-for-the-big-fights-Andhra-Talkies
భారీ ఫైట్స్ కోసం సిద్ధమవుతున్న ఎన్టీఆర్.. తెరపై రచ్చేనట!
తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకోవాలని సిద్ధం అవుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ డ్రామాగా బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్ను కలిగి ఉంటుందని ఇదివరకే రాజమౌళి టీమ్ చెప్పింది. ఒక లుక్లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా మూడో షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడు తారక్. పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు ఎన్టీఆర్.

అయితే ఎన్టీఆర్ను సరికొత్తగా చూపించేందుకు రాజమౌళి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారని టాక్. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటాడట. అందుకోసం తారక్ తన బాడీని మేకోవర్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే మొదటగా ఎన్టీఆర్ తో భారీ ఫైట్స్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. అందుకోసం ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్ కూడా సిద్ధమవుతున్నాడట. మరి సినిమాలో ఎలా కనిపిస్తారనేది కాస్త సస్పెన్స్. ఇక ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...