టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

Heroin-Arthi-Agarwal-Vardhanthi--Winning-a-Cine-Life-Andhra-Talkies
టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ
ఆర్తి అగర్వాల్.. తెలుగు తెరపై ఎంత వేగంగా దూసుకొచ్చిందో.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్. తక్కువ సమయంలోనే అగ్రహీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అనూహ్యంగా గ్రాఫ్ పోగొట్టుకొని ప్రాణాలే కోల్పోయింది.

ఈ మధ్యలోనే ప్రేమ విఫలం కావడం.. వేరే పెళ్లి చేసుకోవడం.. వైద్య చికిత్స వికటించడంతో స్టార్ హీరోయిన్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈరోజు ఆర్తి అగర్వాల్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో మార్చి 5వ తేదీన ఆర్తి అగర్వాల్ జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త. తల్లి వీమా గృహిణి. హీరోయిన్ అవ్వాలన్న ఆశ ఆర్తి అగర్వాల్ లో ఉండేది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అమెరికాలో పర్యటించగా.. ఆర్తిని గుర్తించి ప్రశంసించారు. బాలీవుడ్ లో ‘పాగల్ పన్’ చిత్రంతో ఆర్తి సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత వెంకటేశ్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తరుణ్ ఎన్టీఆర్ చిరంజీవితో ‘ఇంద్ర’ ఉదయ్ కిరణ్ మహేష్ బాబుతో బాబీ బాలయ్య తో అగ్రహీరోలందరితో చేసి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ముద్ర వేసింది.ఆ తర్వాత తను కలిసి నటించిన ఓ యువ హీరోతో పీకల్లోతూ ప్రేమతో మునిగి కెరీర్ ను నాశనం చేసుకుందనే ప్రచారం టాలీవుడ్ లో సాగింది. వారిద్దరూ విడిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి కెరీర్ ను దెబ్బతీసుకుంది. ఆ తర్వాత 2005లో ప్రమాదానికి గురైంది. యువ హీరోతో బ్రేకప్ తో సూసైడ్ అంటెప్ట్ చేసిందన్న వార్తలొచ్చాయి. తలకు బలమైన గాయాలు కావడంతో జూబ్లీహిల్స్ ఆపోలో ఆస్పత్రిలో చికిత్స చేశారు. వెంటీలేటర్ చావు అంచుల వరకు వెళ్లి మళ్లీ కోలుకుంది.

అనంతరం 2007లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. విభేదాలతో వారిద్దరూ 2009లో విడిపోయారు. మళ్లీ సినిమాల్లోకి రావాలనుకునే లావును తగ్గించుకునేందుకు ‘లైపోసెక్షన్’ ఆపరేషన్ చేయించుకుంది. ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఆరు వారాల తర్వాత గుండెపోటుతో 2015 జూన్ 6న మరణించింది. దీంతో అత్యుత్తమ స్థాయికి ఎదిగి టాలీవుడ్ లో విషాదాంతానికి గురైన హీరోయిన్ గా ఆర్తి నిలిచిపోయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...