షాక్: చందమామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

షాక్: చందమామ పెళ్లికి గ్రీన్ సిగ్నల్

Heroin-Kajal-Agarwal-Talking-About-Her-Marriage-Andhra-Talkies
30 ప్లస్ భామలంతా పెళ్లి కోసం ఆరాటపడుతున్నారా? అంటే అవుననే అర్థమవుతోంది. ఇప్పటికే స్వీటీ అనుష్క శెట్టి .. తమన్నా లాంటి సీనియర్లు పెళ్లి మూడ్ లో ఉన్నారని ప్రచారమవుతోంది. ఈలోగానే చందమామ కాజల్ పెళ్లి గురించి ఆసక్తికర సమాచారం ఫిలింసర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. ఇటీవలే 35వ పడిలోకి అడుగుపెట్టేసింది. అందుకే ఇప్పుడు అనూహ్యంగా మూడ్ ఛేంజ్ అయ్యిందట.

ఇంతకుముందు పెళ్లిపై ఆసక్తి లేదని .. ప్రేమ వైఫల్యమే అందుకు కారణమని కాజల్ వెల్లడించినట్టు టాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లేనని తేలింది. ఒకవేళ నిజమే అయినా కానీ ఎట్టకేలకు కాజల్ మూడ్ మారిందన్నది ఇన్ సైడ్ టాక్. సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి పెళ్లాడేసే ఆలోచనలో ఉందిట చందమామ.
ఇప్పటికే ఇంట్లో వాళ్లు వెతికే వరుడినే పెళ్లాడేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందట. మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవెత్తని పెళ్లి చేసుకోవడానికి కాజల్ ఒప్పుకున్నట్లు సమాచారం. అతి త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వివరాల్ని కాజల్ బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై కాజల్ సోషల్ మీడియాల్లో స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం భారతీయుడు 2 సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఐటీ స్కామ్ నేపథ్యంలో మంచు విష్ణు నిర్మిస్తున్న మోసగాళ్లు చిత్రంలోనూ కాజల్ నటిస్తోంది.

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...