నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

Tollywood-Hero-Vijay-Devarakonda-Launched-Plsma-Donar-Poster-Andhra-Talkies
నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కరోనాని జయించి ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీలో సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవర కొండ ప్లాస్మా డోనార్స్ పోస్టర్ ను లాంచ్ చేసారు.

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

anushka-next-project-andhra-talkies
దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?
లాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరికొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టైం దొరికింది కదా.. జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. ఈ ఛాన్సులను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు విడుదల కాకుండా నిలిచిన సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం విడుదల కాకుండా ఆగిపోయింది అనుష్క మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ 'నిశ్శబ్దం'. నిజానికి డిజిటల్ ప్లాట్ఫారమ్లు చందాల ప్రాతిపదికన పనిచేస్తాయి కానీ రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన కాదు. అందుకే డిజిటల్ హక్కుల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తే.. భారీ నష్టాలే మిగులుతాయి తప్ప భారీగా లాభాలను మాత్రం పొందలేరు.

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

Chance-for-that-director-with-bahubali-hero-Prabhas-initiative-andhra-talkies
ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!
బాహుబలి చేస్తున్న సమయంలో సుజీత్ తో సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రబాస్ కోసం వెయిట్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పాటు సాహో చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించాడు. అంటే సాహో చిత్రం కోసం తన కెరీర్ లో దాదాపు అయిదు సంవత్సరాలను సుజీత్ ఖర్చు చేశాడు. సాహో చిత్రం సౌత్ లో కాస్త అటు ఇటు అయినా బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాహుబలితో వచ్చిన పేరును మరింతగా పెంచడంలో సాహో కీలకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాహో వంటి మంచి సినిమాకు తనకు ఇచ్చిన సుజీత్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ సాయం చేశాడు. సుజీత్ వద్ద ఉన్న ఒక కథ నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో దాన్ని నిర్మించేందుకు వంశీ మరియు ప్రమోద్ లను ఒప్పించాడు. దాంతో పాటు శర్వానంద్ మరియు గోపీచంద్ లను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పించాడట. గోపీచంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో శర్వానంద్ గెస్ట్ గా కనిపించబోతున్నాడట. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

Sexy-heroin-Kajal-Looking-Gorgeous-In-Saree-andhra-talkies
లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!
చందమామ చిత్రంతో కాజల్ అగర్వాల్ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతుకు ముందు చేసిన సినిమాల కంటే చందమామతోనే కాజల్ కు ఎక్కువగా పేరు వచ్చింది. అందుకే కాజల్ ను చందమామ బ్యూటీగానే అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అంతటి స్టార్ డం దక్కించుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో సాగుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మరో అయిదేళ్ల వరకు ఈ అమ్మడి స్టార్ డం ఇలాగే ఉంటుందనిపిస్తుంది. తాజాగా హెయిర్ డ్రస్సర్ సీమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఒక సినిమా షూటింగ్ సందర్బంగా కాజల్ మేకప్ అవుతోంది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్న కాజల్ లంగా ఓణిలో నిజంగానే చందమామ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామ అంతటి వెలుగు నీలో ఉంది కాజల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!

the-paranna-jeevi-flew-in-front-of-rgv-movie-power-star
RGV సినిమా "పవర్ స్టార్" ముందు "పరాన్న జీవి" ఎగిరిపోయింది!
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ వైఫల్యంపై ఆర్జీవీ తీసిన సెటైరికల్ మూవీ `పవర్ స్టార్` జూలై 25న రిలీజైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆర్జీవీపై సెటైర్ వేస్తూ నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్ అభిమానులు తీసిన `పరాన్నజీవి` చిత్రం రిలీజైంది. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ రిజల్ట్ అందుకుంది? ఎవరు ఎంత సంపాదించారు? అంటే.. అంతా ఊహించినట్టే `పవర్ స్టార్` ఏటీటీ వేదికపై సక్సెస్ సాధించిందని ప్రచారమవుతోంది. ఈ సినిమా ఏకంగా రెండు కోట్లు వసూలు చేసిందన్నదే షాకింగ్ న్యూస్. అసలు ఏటీటీ కంటెంట్ అన్న పేరుకు తగ్గట్టే ఇది పూర్తి నిడివి సినిమా కానే కాదు. కేవలం 10-12 సన్నివేశాల సమాహారంగా ఒకదానివెంట ఒకటిగా ఎపిసోడ్లు అల్లినట్టు తీసిన 37 నిమిషాల నిడివి లఘు చిత్రంలాగా కనిపిస్తుంది.

రకరకాల వివాదాల్ని క్రియేట్ చేసి ఆర్జీవీ తెచ్చిన హైప్ నడుమ పవర్ స్టార్ సినిమాని మొదటి రోజు జనం బాగానే చూశారు. అయితే అదే రోజు మధ్యాహ్నానికే ఒరిజినల్ క్వాలిటీతో పవర్ స్టార్ మూవీని జనం పైరసీ వీడియోలో చూశారు. ఇది నిజంగా పెద్ద దెబ్బ కొట్టిందన్న విశ్లేషణ సాగుతోంది. అనవసర ఖర్చు లేకుండా పరిమిత బడ్జెట్ తో తీసిన పవర్ స్టార్ ఆర్జీవీ బృందానికి లక్షల్లో లాభాలు తెచ్చిందని విశ్లేషణ సాగుతోంది.

Lady director deceived by the love magic of a stranger | ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్

ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్ 

Lady director deceived by the love magic of a stranger
Lady director deceived by the love magic of a stranger
ఆమె ఒక ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్..ఎంతో మంది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కే సినిమా చూపించాడో ఫేస్ బుక్ తో పరిచయమైన దొంగ ప్రేమికుడు.. ఈ కేటుగాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని నిండా ముంచి లక్షల రూపాయలు లాక్కున్నాడు. ఆమెను శారీరకంగానూ, ఆర్ధికంగానూ వాడేసుకున్నాడు.

కర్ణాటక లోని బెంగళూరు నగరంలో ఉన్న మారుతినగర్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల అందమైన అసిస్టెంట్ డైరెక్టర్ కన్నడ శాండిల్ వుడ్ లోని ప్రముఖ దర్శకుడి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. దర్శకురాలిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

ఈమెకు 2018లో ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం స్నేహంగా మారి ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రేమ పేరుతో ఆ సహాయ దర్శకురాలిని యువకుడు ముగ్గులోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని.. శారీరకంగా దగ్గరయ్యాడు. యువతితో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర అవసరాల కోసం లక్షల రూపాయలు తీసుకున్నాడు.
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...