నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

Tollywood-Hero-Vijay-Devarakonda-Launched-Plsma-Donar-Poster-Andhra-Talkies
నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కరోనాని జయించి ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీలో సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవర కొండ ప్లాస్మా డోనార్స్ పోస్టర్ ను లాంచ్ చేసారు.కాగా విజయ్ దేవర కొండ మాట్లాడుతూ.. "మా బంధువులకు కరోనా సోకింది. అప్పుడు వారికి ప్లాస్మా అవసరం వచ్చింది. కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు. అప్పుడే ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది. ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ప్లాస్మా దానం చేయడం వల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్ రావని ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే donateplasma.scsc.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నాను. వ్యాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కరోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా" అని చెప్పుకొచ్చారు.

ఇక సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. "ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది. ఒక్క కరోనా పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కరోనా పేషేంట్ లను కాపాడవచ్చు. ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు. 200 మంది పేషెంట్ ను కాపాడాము. ప్లాస్మా దానం చేసిన వారు కరోనా యోధులు. వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేసి తోటి వారిని కాపాడాలి'' అని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...