ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

heroine-another-experiment-villain-Andhra-Talkies
ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే! దర్శకుడిగా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ దర్శకుడు విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందరిలా కాకుండా విభిన్న స్థాయిలో సినిమాలు తీసి గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే తన సెకండ్ మూవీ ‘మహసముద్రం’ను చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ విభిన్నంగా ఉండటంతో పాటు పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో ఇద్దరు ముగ్గురు హీరోలు ఓకే చెప్పి ఆ తర్వాత వర్కౌట్ అయ్యేనో లేదో అంటూ తప్పుకున్నారు. చివరకు శర్వానంద్ మహాసముద్రంను ఈదేందుకు సిద్దం అయ్యాడు.మహాసముద్రం సినిమాకు సంబంధించి అన్నీ పనులు పూర్తయ్యి పోయాయి. కరోనా ప్రభావం తగ్గితే షూటింగ్ కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100  లో హీరోయిన్ ను నెగటివ్ షేడ్స్ లో చూపించిన దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రంలో ఏకంగా హీరో ను కాస్త నెగటివ్ గా చూపించబోతున్నాడట. ఎలాంటి పాత్రను అయినా ఈజీగా చేయగల సత్తా ఉన్న శర్వానంద్ ఖచ్చితంగా ఈ చిత్రంలోని ఆ నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రకు ప్రాణం పోస్తాడనే నమ్మకంను అభిమానులు మరియు సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ అన్నీ సజావుగా జరిగి, పరిస్తితి చక్క బెడితే వచ్చే సంవత్సరంలో పేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు ఈసారి కూడా ఎంతవరకూ విజయం సాధిస్తాడో?


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...