గత కొంతకాలంగా సీనియర్ నటి రమ్యకృష్ణపై రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ రేంజు అమాంతం మారిపోయింది. మోస్ట్ పవర్ ఫుల్ శివగామి పాత్రలో నటించాక తన ఇమేజ్ పదింతలైంది. అందుకు తగ్గట్టే వరుస అవకాశాలతో భారీగా ఆర్జిస్తోందని ప్రచారమవుతోంది. అయితే ఇదంతా నిజమే కానీ.. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్ పరంగా ఫలానా సినిమా చేస్తున్నారు? అన్న దానిపై స్పష్టమైన క్లారిటీ అయితే లేదు.
అప్పట్లో శివగామి పాత్రకు కొనసాగింపుగా ఫిక్షన్ కథతో తీస్తున్న సినిమాలో నటిస్తున్నారని పోస్టర్లు రివీలయ్యాయి. ఆ సినిమా రిలీజ్ కి రాలేదింకా. ఈలోగానే రమ్యకృష్ణ నటించిన పలు తమిళ చిత్రాలు రిలీజై వెళ్లాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనూ క్షణం తీరిక లేనంతగా వరుసగా సినిమాలకు కమిటవుతున్నారని ప్రచారమవుతోంది. పైగా తెలుగు ఫిలిం సర్కిల్స్ లో రమ్య రెగ్యులర్ గా ప్రత్యక్షమవుతుండడంతో చెన్నయ్ వదిలిన రమ్యకృష్ణ ఇక్కడ మరోసారి పూర్తిగా బిజీ అయిపోతోందంటూ ప్రచారం మొదలైంది.