క్వీన్ కంగన రనౌత్ .. హృతిక్ రోషన్ మధ్య వివాదం గురించి తెలిసిందే. క్రిష్ 3 సమయం నుంచి ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ వివాదంలోకి హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ని కంగన లాగడంతో అతడు ఈ భామపై భగ్గుమన్నాడు. అప్పట్లో కోర్టుల వరకూ వెళ్లింది ఈ గొడవ. కంగన తన సిస్టర్ రంగోలి సాయంతో హృతిక్ అండ్ గ్యాంగ్ పై ప్రతిసారీ మాటల యుద్ధం చేస్తోంది. వీలున్న ప్రతి వేదికపైనా పురుషాధిక్య ప్రపంచాన్ని అలానే హృతిక్ ని కలిపి గంపగుత్తగా తిట్టేస్తోంది కంగన. అయితే ఈ ఎపిసోడ్స్ వల్ల హృతిక్ తీవ్రంగా మనస్థాపానికి గురవుతూనే ఉన్నారు. ఒక రకంగా మహిళా ప్రపంచంపై సింపథీని కంగన తెలివిగా క్యాష్ చేసుకుంటూ తన శత్రువుల్ని చీల్చి చెండాడుతోంది. తనని కెరీర్ ఆరంభంలో ఆడుకున్న ఈ మగ ప్రపంచాన్ని తూట్లు పొడిచే ఏ అవకాశాన్ని కంగన అస్సలు వదులుకోవడం లేదు.
Showing posts with label Kangana Ranaut. Show all posts
Showing posts with label Kangana Ranaut. Show all posts
కంగనా తిట్లకు అసలు కారణం అదా?
ఆలియా భట్ తన పనేదో తాను చేసుకుంటోంది. చక్కగా నటిస్తోంది. హిట్లు కొడుతోంది. ఏ వివాదంలో తల దూర్చకుండా సాగిపోతోంది. కానీ ఆమెను అదే పనిగా గిచ్చి గిచ్చి వివాదాల్లోకి లాగుతోంది కంగనా రనౌత్. ఆమెతో పోలిస్తే కంగనా నటిగా తక్కువే కావచ్చు. కానీ తన స్థాయిలో ఆమె బాగానే నటిస్తోంది. ఎప్పుడూ ఆలియా.. కంగనా జోలికి వచ్చింది లేదు. ఆమెను తక్కువ చేసి మాట్లాడింది లేదు. కంగనా అదే పనిగా తనను టార్గెట్ చేసినా కూడా ఆమె హుందాగానే స్పందిస్తోంది. అయినా కంగనా.. ఆలియాను విడిచిపెట్టకుండా అదే పనిగా గిచ్చుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. నటిగా ఆలియా తక్కువ చేసి మాట్లాడటమే కాక.. ఆమె బ్యాగ్రౌండ్ గురించి రణబీర్ కపూర్ తో ప్రేమాయణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది కంగనా.
క్రిష్ ను ఇంకా వదలని కంగనా..!
దర్శకుడు క్రిష్ మీద కంగనాకి పీకలదాకా కోపమన్న సంగతి మనందరికీ తెలిసిందే! ఆ కోపం ఎందుకు వస్తుందో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. కంగనాతో వేగలేక క్రిష్ "మణికర్ణిక" నుంచి తప్పుకున్నా క్రిష్ మీద కంగనా విసుర్లు ఆగడం లేదు. నిన్న మొన్నటి దాకా తన సినిమాను చెత్తగా తీశాడని అందుకే రీషూట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు "కధానాయకుడు",మహానాయకుడు" మీద పడింది. ఈ రెండు సినిమాలు ప్లాఫ్ కావడానికి క్రిష్ కారణమని ఆ రెండు సినిమాలు పరమ చెత్తగా తీశాడని అంటోంది. ఈ సినిమాల పరాజయంలో బాలకృష్ణ ప్రమేయం ఏమీ లేదని, ఆయన చాలా బాగా చేసినా, దర్శకుడు ప్రతిభావంతుడు కాకపోవడంతో ఫలితం తిరగబడిందని చెప్పుకొచ్చింది. కంగనా వరస చూస్తుంటే క్రిష్ ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదని సినీ జనాలు అంటున్నారు. హృతిక్ లాంటి హీరోనే కంగనా దెబ్బకు కామ్ అయ్యిపోవాల్సి వచ్చిందనీ, ఇంక క్రిష్ గురించి చెప్పుకోనక్కరలేదనీ అంటున్నారు. ఇంతకీ వీరిద్దరి గొడవకు అసలు కారణాలేమిటో..?
Subscribe to:
Posts (Atom)
Powered by andhratalkiesinfo
