Showing posts with label Movie News. Show all posts
Showing posts with label Movie News. Show all posts

థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

 థియేటర్లు తెరవడంపై తెలుగు రాష్ట్రాల్లో అనిశ్చితి

Uncertainty-in-Telugu-states-over-opening-of-theaters-andhra-talkies
రాష్ట్రాలు థియేటర్లు తెరిచేందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నాయా? లేవా? జనం థియేటర్లు తెరిస్తే సినిమాలు చూసేందుకు బయటకు వస్తారా రారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. రేపటి నుంచి సస్పెన్స్ కి తెర దించేస్తారేమోనన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు ఏపీలో రేపటి నుంచి థియేటర్లు తెరవరు. తెలంగాణలో తెరుస్తారా లేదా? అన్నదానిపై సమాచారం రాలేదు.


అన్ లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడంపై ఇంకా చాలా అనిశ్చితి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీనిని థియేటర్ యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించనున్నాయట.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హాజరైన ప్రముఖ దర్శకుడు..!

bollywood-director-Anurag-Kashyap-issued-summons-to-be-present-for-questioning-in-rape-case
తెలుగులో 'ప్రయాణం' 'ఊసరవెల్లి' వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పాయల్ అగర్వాల్.. ఇటీవల బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని.. తనను రూమ్ లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనురాగ్ కశ్యప్ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం) - 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్) - 341 మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేయబడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1న ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు దర్శకుడికి సమన్లు జారీ చేశారు.

27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి

Bollywood Breaking-Sonakshi-Sinha-files-FIR-against-cyber-bullies--One-Arrested
27 ఏళ్ల కుర్రాడు అరెస్ట్.. కేసు బుక్ చేసిన సోనాక్షి
సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం బూతులు మాట్లాడేస్తూ నచ్చిన భాషను ఉపయోగించేస్తే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ చూస్తూ ఊరుకోదు. దూషణలు .. పరాచికాలకు దిగినా .. వేధింపులకు పాల్పడినా ఫిర్యాదు మేరకు వెంటనే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ తరహాలో ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అరెస్టులు చేసి జైల్లో వేశారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పైనా బూతు పదజాలంతో వల్గర్ పోస్టులు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు ఈ 27 ఏళ్ల కుర్రాడు.

సోనాక్షిని ఇష్టానుసారం దూషిస్తూ ఇష్టానుసారం పోస్టింగులతో చెలరేగిన ఆయువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందినవాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.  తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శశికాంత్ గులాబ్ జాదవ్.

భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్

Sexy-Heroin-Bipasha-made-some-interesting-comments-on-a-talk-show-andhra-talkies
భర్తలు అంతా రాత్రి 30 నిమిషాల పాటు భార్యల కాళ్లు నొక్కాలంటున్న స్టార్ హీరోయిన్
బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం ఒక ఊపు ఊపేసి స్టార్ హాట్ హీరోయిన్ గా కొనసాగిన ముద్దుగుమ్మ బిపాస బస్సు ప్రస్తుతం వైవాహిక జీవితంలో పడిపోయింది. ఈ సమయంలో కూడా ఆమె సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడంతో పాటు రెగ్యులర్ గా ఏదో ఒక షోలో కనిపిస్తూనే ఉంది. గత కొంతకాలం నుంచి వెబ్ సిరీస్సుల్లో కూడా తన మార్క్ చూపెడుతూ పేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది.. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకున్న బిపాస బస్సు తన భర్తతో కలిసి పలు చిత్రాల్లో నటించింది. భర్తతో నటించడం అనేది తనకు చాలా ఇష్టమైన విషయం అంది. ఆయనతో కలిసి నటించడం చాలా సులభంగా అనిపిస్తుంది.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

Judgment-on-Ramgopal-Varma-Movie-Murder-postponed-Andhra-Talkies
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.

ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.

సుశాంత్ ను కుక్క బెల్డ్ తో హత్య చేశారు

Hero-Sushant-was-killed-with-a-dog-belt-Andhra-Talkies
సుశాంత్ ను కుక్క బెల్డ్ తో హత్య చేశారు
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్య కేసు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలను కుదిపేస్తుంది. బలవంతపు ఆత్మహత్య అంటూ కొందరు కాదు ఖచ్చితంగా హత్య అంటూ మరికొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసు సీబీఐ వారికి అప్పగించాల్సిందే అంటూ సుశాంత్ రాజ్ పూత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో సుశాంత్ వద్ద గతంలో ఉద్యోగం చేసిన అంకిత్ ఆచార్య షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య కాలంలో అంకిత్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇటీవల రియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సుశాంత్ మరణంపై ఉన్న అనుమానాలను మరింతగా పెంచాయి. ఇప్పుడు అతడు ఏకంగా సుశాంత్ ను హత్య చేసి ఉంటారు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్ ఇంట్లో ఉండే పెంపుడు కుక్క ఫడ్జ్ కు ఉండే బెల్డ్ తో అతడి గొంతును బిగించి కొట్టి హత్య చేసి ఉంటారు అంటూ అంకిత్ ఆరోపిస్తున్నాడు. అతడి శరీరంపై ఉన్న గాయాలను చూస్తుంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సుశాంత్ వద్ద పని చేసే పలువురిని రియా చక్రవర్తి తొలగించింది. కారణం లేకుండా వారిని తొలగించడంతో పాటు తనకు నమ్మకస్తులు అయిన వారిని ఉద్యోగంలో పెట్టిందని అంకిత్ అంటున్నాడు.

ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!

heroine-another-experiment-villain-Andhra-Talkies
ఈసారి హీరోనే విలన్ వర్మ శిష్యుడి మరో ప్రయోగం!
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఎక్స్ 100 చిత్రం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే! దర్శకుడిగా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నాడు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుండి వచ్చిన ఈ దర్శకుడు విభిన్న చిత్రాలను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందరిలా కాకుండా విభిన్న స్థాయిలో సినిమాలు తీసి గురువును మించిన శిష్యుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే తన సెకండ్ మూవీ ‘మహసముద్రం’ను చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ విభిన్నంగా ఉండటంతో పాటు పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో ఇద్దరు ముగ్గురు హీరోలు ఓకే చెప్పి ఆ తర్వాత వర్కౌట్ అయ్యేనో లేదో అంటూ తప్పుకున్నారు. చివరకు శర్వానంద్ మహాసముద్రంను ఈదేందుకు సిద్దం అయ్యాడు.

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ

Tollywood-Hero-Vijay-Devarakonda-Launched-Plsma-Donar-Poster-Andhra-Talkies
నాకు కరోనా వస్తే ప్లాస్మా డొనేట్ చేస్తా : విజయ్ దేవరకొండ
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మనదేశంలో సంపూర్ణ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండడం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కరోనాని జయించి ఇంటికి వెళ్లిన పేషెంట్స్ తప్పనిసరిగా తమ ప్లాస్మాను ఇచ్చి సాటి మనుషుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ప్లాస్మా డొనేషన్ కోసం ఎదురుచూస్తున్న కరోనా బాధితులకు కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను జయించి ప్లాస్మా డొనేట్ చేసిన వారిని సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసీలో సన్మానించారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవర కొండ ప్లాస్మా డోనార్స్ పోస్టర్ ను లాంచ్ చేసారు.

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?

anushka-next-project-andhra-talkies
దేవసేన నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా.. మరి ఎందుకు నో చెప్పింది..?
లాక్ డౌన్ వలన గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో విడుదల కావల్సిన సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మరికొన్ని నెలల వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక టైం దొరికింది కదా.. జనాలు ఓటిటిలకు అలవాటు పడిపోయారు. ఈ ఛాన్సులను క్యాష్ చేసుకునేందుకు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి సంస్థలు విడుదల కాకుండా నిలిచిన సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం విడుదల కాకుండా ఆగిపోయింది అనుష్క మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ 'నిశ్శబ్దం'. నిజానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు చందాల ప్రాతిపదికన పనిచేస్తాయి కానీ రెవిన్యూ షేరింగ్ ప్రాతిపదికన కాదు. అందుకే డిజిటల్ హక్కుల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తే.. భారీ నష్టాలే మిగులుతాయి తప్ప భారీగా లాభాలను మాత్రం పొందలేరు.

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!

Chance-for-that-director-with-bahubali-hero-Prabhas-initiative-andhra-talkies
ప్రభాస్ చొరవతో ఛాన్స్ దక్కించుకున్న దర్శకుడు!
బాహుబలి చేస్తున్న సమయంలో సుజీత్ తో సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రబాస్ కోసం వెయిట్ చేయడంతో పాటు రెండు సంవత్సరాల పాటు సాహో చిత్రాన్ని సుజీత్ తెరకెక్కించాడు. అంటే సాహో చిత్రం కోసం తన కెరీర్ లో దాదాపు అయిదు సంవత్సరాలను సుజీత్ ఖర్చు చేశాడు. సాహో చిత్రం సౌత్ లో కాస్త అటు ఇటు అయినా బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాహుబలితో వచ్చిన పేరును మరింతగా పెంచడంలో సాహో కీలకంగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సాహో వంటి మంచి సినిమాకు తనకు ఇచ్చిన సుజీత్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభాస్ సాయం చేశాడు. సుజీత్ వద్ద ఉన్న ఒక కథ నచ్చడంతో తన హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ లో దాన్ని నిర్మించేందుకు వంశీ మరియు ప్రమోద్ లను ఒప్పించాడు. దాంతో పాటు శర్వానంద్ మరియు గోపీచంద్ లను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పించాడట. గోపీచంద్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో రూపొందబోతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో శర్వానంద్ గెస్ట్ గా కనిపించబోతున్నాడట. ఈ కాంబో సెట్ అవ్వడానికి పూర్తి కారణం ప్రభాస్ అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!

Sexy-heroin-Kajal-Looking-Gorgeous-In-Saree-andhra-talkies
లంగా ఓణిలో కాజల్ అగర్వాల్ ను చూస్తే అంతే సంగతులు!
చందమామ చిత్రంతో కాజల్ అగర్వాల్ తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతుకు ముందు చేసిన సినిమాల కంటే చందమామతోనే కాజల్ కు ఎక్కువగా పేరు వచ్చింది. అందుకే కాజల్ ను చందమామ బ్యూటీగానే అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. అంతటి స్టార్ డం దక్కించుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా మంచి ఆఫర్స్ తో కెరీర్ లో సాగుతోంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రంలో కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. మరో అయిదేళ్ల వరకు ఈ అమ్మడి స్టార్ డం ఇలాగే ఉంటుందనిపిస్తుంది. తాజాగా హెయిర్ డ్రస్సర్ సీమ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.

ఒక సినిమా షూటింగ్ సందర్బంగా కాజల్ మేకప్ అవుతోంది. నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్న కాజల్ లంగా ఓణిలో నిజంగానే చందమామ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చందమామ అంతటి వెలుగు నీలో ఉంది కాజల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Lady director deceived by the love magic of a stranger | ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్

ఓ అపరిచితుడి ప్రేమ మాయలో మోసపోయిన లేడీ డైరెక్టర్ 

Lady director deceived by the love magic of a stranger
Lady director deceived by the love magic of a stranger
ఆమె ఒక ప్రముఖ అసిస్టెంట్ డైరెక్టర్..ఎంతో మంది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తీసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కే సినిమా చూపించాడో ఫేస్ బుక్ తో పరిచయమైన దొంగ ప్రేమికుడు.. ఈ కేటుగాడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని నిండా ముంచి లక్షల రూపాయలు లాక్కున్నాడు. ఆమెను శారీరకంగానూ, ఆర్ధికంగానూ వాడేసుకున్నాడు.

కర్ణాటక లోని బెంగళూరు నగరంలో ఉన్న మారుతినగర్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల అందమైన అసిస్టెంట్ డైరెక్టర్ కన్నడ శాండిల్ వుడ్ లోని ప్రముఖ దర్శకుడి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేస్తోంది. దర్శకురాలిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.

ఈమెకు 2018లో ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం స్నేహంగా మారి ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. ప్రేమ పేరుతో ఆ సహాయ దర్శకురాలిని యువకుడు ముగ్గులోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని.. శారీరకంగా దగ్గరయ్యాడు. యువతితో ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గర అవసరాల కోసం లక్షల రూపాయలు తీసుకున్నాడు.

తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!

తన పరువాలను చూస్తూ ఉండిపో.. అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ!
Stay-tuned-for-more-Ismart-Beauty-Andhra_talkies
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరంటే వారు హీరోయిన్ అయిపోరు. కొందరేమో అదృష్టం కొద్ది హీరోయిన్ అవుతారు. మరికొందరేమో ముందే అనుకొని హీరోయిన్ అవుతారు. ఇంకొందరేమో ఎక్స్పెక్ట్ చేయకుండానే హీరోయిన్ అయిపోతారు. ఇందులో రెండో కోవకు చెందిందే నిధి అగర్వాల్. అంటే ఈ అమ్మడు చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కంటూ పెరిగింది. అనుకున్నట్లుగానే మోడలింగ్ లో రాణించి సినిమా అవకాశాలు చేజిక్కించుకుంది. మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ అయిన ఈ భామ ఆ వెంటనే సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. కానీ కొందరు హీరోయిన్లకి పట్టుదల పరువాలతో పాటు అదృష్టం కూడా కొంత కావాల్సి ఉంటుంది. నిధి విషయంలో మాత్రం అదృష్టం ఆవగింజంత కూడా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిధి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఆమెకు కొంచం కూడా గుర్తింపు తీసుకు రాలేకపోయాయి.

అయితే తెలుగులో గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి హిట్టును తన ఖాతాలో వేసుకుంది నిధి. ఈ సినిమాతో గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా జిల్లెలమ్మ జిట్టా.. ఉండిపో లాంటి పాటలలో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. అందుకే కుర్రకారు అలా ప్లాట్ అయిపోయారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన నిధి.. సోషల్ మీడియాలో వేడెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ డ్రెస్సింగ్ స్టైల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో పిక్ పెట్టింది. అంతే అభిమానులకు కన్నుల పండుగే అవుతుందని చెప్పాలి. ఆ మోడరన్ డ్రెస్సులో అమ్మడి అందాలు కనిపించి కనిపించినట్లు.. చూపించి చూపించనట్లుగా ఊరిస్తున్నాయి. మరి కుర్ర హృదయాలు ఊరుకుంటాయా.. అలా కళ్లప్పగించి ఉండిపోతున్నారంతే. ప్రస్తుతం అమ్మడు గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలో నటిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం భారీ ఖర్చుతో బ్యాంకు సెట్.. సిద్దమైందా..?
bank-set-at-huge-cost-for-Super-Star-Mahesh-babu-ready-Andhra_talkies
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ - మహేష్ బాబుల కాంబినేషన్ ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ సర్కారు వారి పాట టైటిల్ అయితే విపరీతంగా బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగానే ప్రేక్షకుల నుండి ఊహించని రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల పోస్టర్ విడుదల కాగా ఇందులో మహేష్ లాంగ్ హెయిర్ లైట్ బియర్డ్ తో ఇంతక ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌లో కనిపించి కిక్ ఇచ్చాడు.

ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర

ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర

Violently-tortured--Singer-Suchitra-on-father-son-death-Andhra-Talkies
ఓవైపు ప్రపంచమంతా అమెరికాలో జాత్యాహంకార హత్యపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. జార్జ్ ఫ్లాయిట్ హత్య అమెరికాను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని టుటికోరిన్లో జరిగిన ఓ తండ్రీకొడుకులు జయరాజ్ ఫినిక్స్ల మృతి కుదిపేస్తోంది. ఈ మృతిపై ప్రముఖ సింగర్ సుచిత్ర స్పందించారు. వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపించినట్లుగా అర్థమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

జయరాజ్ ఫినిక్స్‌లో మోకాళ్లను స్టిక్స్‌తో విరగ్గొట్టారని ముఖాన్ని గోడకేసి కొట్టారని వారి ఒంటిపై దుస్తులు లేకుండా కొట్టానట్లుగా తెలుస్తోందన్నారు. చెప్పలేని విధంగా హింసించినట్లు తెలిపారు. జస్టిస్ జయరాజ్ ఫీనిక్స్ అంటూ ట్వీట్ చేశారు. దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితమవుతున్నాయని అందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవడమే ప్రధాన కారణమని వీడియోలో మొదట చెప్పారు. అందుకే ఈ వివరాలను పోలీసుల దాడి ఘటనను ఇంగ్లీష్‌లో వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె జార్జ్ ఫ్లాయిడ్ హత్యను గుర్తు చేశారు.

టాలీవుడ్ లో పాజిటివ్ కేసులున్నా బయటకి చెప్పడం లేదా...?

టాలీవుడ్ లో పాజిటివ్ కేసులున్నా బయటకి చెప్పడం లేదా...?

Tollywood-People-Not-Reveals-New-Dangerous-Virus-Cases-Andhra-Talkies
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ఉగ్రరూపాన్ని చూపిస్తూ వస్తోంది. ఈ వైరస్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తూ వస్తోంది. దీని నివారణకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలు కొన్నాళ్ల పాటు ఈ మహమ్మారితో సహజీవనం సాగించాలనే నిర్ణయానికి వచ్చేసారు. దీంతో లాక్ డౌన్ లో సడలింపులు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా నిర్వహించడంతో కేసులు కూడా ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు డాక్టర్లు కరోనా బారిన పడగా తాజాగా సినీ ప్రముఖులకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. నటుడు నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

హృదయాలను కలిచి వేస్తున్న సుశాంత్ లాస్ట్ పోస్ట్...!

Sushant-Singh-Rajput-Last-Post-in-His-Social-Media-Andhra-Talkies
ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ ''ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ'' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఆయన ఈ రోజు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం సినీ లోకాన్ని షాక్ కి గురి చేసింది. సుశాంత్ ముంబై బంద్రాలోని తన నివాసంలో ఫ్యాన్ కి ఉరేసుకొని బలవన్మరణం చెందినట్లు గుర్తించారు. 34 ఏళ్ళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి యావత్ సినీ అభిమనుల హృదయాలను కలచి వేసింది. సుశాంత్ గతకొంత కాలంగా బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు.

కాగా 2008 నుండి అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై తన హవా చూపించిన సుశాంత్ తన నటనతో డ్యాన్స్ లతో అందరినీ ఆకట్టుకున్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. సుశాంత్ సింగ్ జూన్ 3న ఇంస్టాగ్రామ్ లో చివరి పోస్ట్ పెట్టారు. 

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు?

సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు?

Bollywood-star-Sushant-Singh-Rajput-dead-at-Andhra-Talkies
బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సంచలనమైన సంగతి తెలిసిందే. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ ఆదివారం ఉదయం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 34 ఏళ్ల నటుడి మృతికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ శర్మ తెలిపారు.

అయితే ఇది ఆత్మహత్య కాదు.. హత్య!! అంటూ సుశాంత్ మేనమామ ఆరోపించారు. తన మేనల్లుడు ఆకస్మిక మరణంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పీఎం నరేంద్ర మోదీ స్వయంగా పూనుకుని సీబీఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేసారు.

మూడు నెలలకు మొదలైన షూటింగుల సందడి..!

మూడు నెలలకు మొదలైన షూటింగుల సందడి..!

Telangana-allows-Tollywood-to-resume-movie-shootings-Andhra-Talkies
ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు షూటింగులకు అనుమతులివ్వడంలో సానుకూలంగా వ్యవహరించడంతో హర్షం వ్యక్తమైంది. మరో వారం రెండు వారాల్లో సినిమాల షూటింగులకు సన్నాహకాల్లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈలోగా టీవీ సీరియళ్ల షూటింగులు ప్రారంభమయ్యాయి. సెట్స్ కెళ్లేందుకు నటీనటులు సహా కార్మికులు సిద్ధమవ్వడంతో టాలీవుడ్ లో దాదాపు మూడు నెలల విరామం తర్వాత కొత్త కళ కనిపించింది. దాదాపు అరడజను సీరియళ్ల షూటింగులకు ఇప్పటికే సన్నాహకాల్లో ఉన్నాయి యూనిట్లు.

టీవీ సీరియళ్లకు పరిమిత సిబ్బందితో ఫర్వాలేదు కానీ సినిమాల విషయంలోనే కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అంచనా. ఇప్పటివరకూ ఒక్కరూ షూటింగ్ ప్రారంభించలేదు. అందరికంటే ముందుగా జక్కన్న ఆర్.ఆర్.ఆర్ షూట్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. మరో వారంలోనే ఆయన సెట్స్ కెళ్లనున్నారు. సక్సెసైతే అతడిని ఫాలో చేసేందుకు ఇతరులు వేచి చూస్తున్నారు.

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ

Heroin-Arthi-Agarwal-Vardhanthi--Winning-a-Cine-Life-Andhra-Talkies
టాలీవుడ్ లో ఆర్తి అగర్వాల్ విషాదాంతం స్టోరీ
ఆర్తి అగర్వాల్.. తెలుగు తెరపై ఎంత వేగంగా దూసుకొచ్చిందో.. అంతే వేగంగా కనుమరుగైన హీరోయిన్. తక్కువ సమయంలోనే అగ్రహీరోలందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అనూహ్యంగా గ్రాఫ్ పోగొట్టుకొని ప్రాణాలే కోల్పోయింది.

ఈ మధ్యలోనే ప్రేమ విఫలం కావడం.. వేరే పెళ్లి చేసుకోవడం.. వైద్య చికిత్స వికటించడంతో స్టార్ హీరోయిన్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈరోజు ఆర్తి అగర్వాల్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో మార్చి 5వ తేదీన ఆర్తి అగర్వాల్ జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త. తల్లి వీమా గృహిణి. హీరోయిన్ అవ్వాలన్న ఆశ ఆర్తి అగర్వాల్ లో ఉండేది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి అమెరికాలో పర్యటించగా.. ఆర్తిని గుర్తించి ప్రశంసించారు. బాలీవుడ్ లో ‘పాగల్ పన్’ చిత్రంతో ఆర్తి సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత వెంకటేశ్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తరుణ్ ఎన్టీఆర్ చిరంజీవితో ‘ఇంద్ర’ ఉదయ్ కిరణ్ మహేష్ బాబుతో బాబీ బాలయ్య తో అగ్రహీరోలందరితో చేసి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ముద్ర వేసింది.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...